Begin typing your search above and press return to search.

ఓటమి తర్వాత రోజా ఫస్ట్ రియాక్షన్... తెరపైకి సిగ్గుపడే అంశం!

అవును... ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడంపై మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:41 AM GMT
ఓటమి తర్వాత రోజా ఫస్ట్ రియాక్షన్... తెరపైకి సిగ్గుపడే అంశం!
X

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన ఆ పార్టీ.. ఈ దఫా 11 స్థానాలకే పరిమితమైంది. అయితే వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా ఓడిపోవడంలో మంత్రుల పాత్ర అత్యంత కీలకం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

అవును... ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడంపై మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఫలితాల అనంతరం ఇంతకాలం సైలంట్ గా ఉన్నట్లు కనిపించిన నేతలు.. ఆత్మపరిశీలన అనంతరమో ఏమో కానీ ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆసక్తికరంగా రియాక్ట్ అవ్వగా... తాజాగా ఆర్కే రోజా స్పందించారు.

ఈ క్రమంలో నగరిలో తన ఓటమి, రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమిపై ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ.. మంచి చేసి ఓడిపోయాం. గౌరవంతా తలెత్తుకు తిరుగుదాం. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్ధాం" అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. దీంతో... జగన్ అభిప్రాయంతోనే రోజా కూడా ఏకీభవిస్తూ వ్యాఖ్యానించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రజలకు ఎంతో మంచి చేశామని, అయినా ఓడిపోయామని, ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సుమారు 40శాతం మంది ప్రజలు తమవైపు ఉన్నారని.. బలంగా నిలబడితే అంతకు మించి బలంగా ఉవ్వెత్తున తిరిగి లేవొచ్చని నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆ సంగతి అలా ఉంటే... ఎన్నికలకు ముందు నుంచీ నగరిలో ఈదఫా రోజా ఓడిపోతారంటూ భారీగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో అయితే... వైసీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ నగరే అంటూ చాలామంది వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో పలు సర్వేలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. అయినప్పటికీ రోజాకు టిక్కెట్ ఇచ్చారు జగన్.

అయితే రోజా ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు పరిశీలకులు. అందులో ఒకటి... రోజాకు మంత్రి పదవి వచ్చిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని.. అందుకు గల కారణం అందరికంటే ఎక్కువగా రోజాకు, ఆమె సోదరులకూ తెలుసని అంటున్నారు. మరో కారణం... వైసీపీలో మరోవర్గం తిరుగుబావుటా ఎగరెయ్యడమే అని చెబుతున్నారు.