Begin typing your search above and press return to search.

న్యూజెర్సీలో షాప్ చోరీ... ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్!

ఉన్నత చదువుల కోసం న్యూజెర్సీ వెళ్లిన ఇద్దరు తెలుగు యువతులు దొంగతనం కేసులో అరెస్టవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   19 April 2024 4:43 AM GMT
న్యూజెర్సీలో షాప్  చోరీ... ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్!
X

ఉన్నత చదువుల కోసం న్యూజెర్సీ వెళ్లిన ఇద్దరు తెలుగు యువతులు దొంగతనం కేసులో అరెస్టవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత నెలలో అమెరికాలోని న్యూజెర్సీలోని కిరాణా దుకాణంలో షాప్‌ చోరీకి పాల్పడిన కేసులోని ఇద్దరు భారతీయ యువతుల్లో ఒకరు హైదరాబాద్ కు చెందినవారు కాగా.. మరొకరు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందినవారు!

అవును ఈ ఇద్దరు యువతులు స్టీవెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు న్యూజెర్సీకి వెళ్లారు! ఈ క్రమంలో... హోబోకెన్ షాప్‌ రైట్‌ లో 155.61 డాలర్ల విలువైన వస్తువులను తీసుకుని కేవలం రెండింటికి మాత్రమే డబ్బులు చెల్లించారంట! ఈ నేపథ్యంలో మార్చి 19న హోబోకెన్ సిటీ పోలీసులు వారిని పట్టుకున్నారు!

పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఇద్దరూ పూర్తి మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పగా.. వారిలో మరొకరు రెట్టింపు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదించారని అంటున్నారు. ఇదే సమయంలో పోలీసులకు క్షమాపణలు చెప్పడంతోపాటు.. ఈసారికి విడిచిపెడితే ఈ నేరం పునరావృతం కాదని చెప్పారని అంటున్నారు. అకౌంట్ లో లిమిటెడ్ బ్యాలెన్స్ ఉండటంతో కొన్ని వస్తువులకు చెల్లించడం మర్చిపోయినట్లు వెల్లడించారని తెలుస్తుంది!

అయితే అరెస్ట్ తప్పదని వారికి హోబోకెన్ పోలీసులు స్పష్టం చేశారు. విచారణలో వారు పదే పదే నేరాలకు పాల్పడుతున్నట్లు తేలిందని పోలీసులు చెబుతున్నట్లు తెలిసింది. దీంతో... వీరికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారగా.. తెలుగు వారి పరువు తీశారనే కామెంట్లు పలువురు నెటిజన్ల నుంచి కనిపించడం గమనార్హం!!

కాగా... 2015లో టేనస్సీలోని వాల్‌ మార్ట్ స్టోర్ నుండి $4,500 విలువైన 155 రేజర్‌ లను ఇద్దరు భారతీయ మహిళలు దొంగిలించిన సందర్భాన్ని ఈ ఘటన గుర్తుకు తెస్తుందని చెబుతున్నారు. నాడు ఆ మహిళ, ఆరు లేదా ఏడేళ్ల పిల్లలతో కలిసి రహస్యంగా డ్రెస్ లోపల వేసుకున్న దృశ్యం దుకాణంలోని సీసీటివి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆపై వెంటనే మినీ వ్యాన్‌ లో ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారు!