Begin typing your search above and press return to search.

బిన్ లాడెన్ ను చంపిన సైనికుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా..?

ఆ ఆపరేషన్ అనంతరం కొన్నాళ్లపాటు బిన్ లాడెన్ ను చంపింది ఎవరు అనే పేరు గోప్యంగా ఉంది. అయితే.. ఆ తర్వాత ప్రపంచానికి తెలిసిపోయింది. అతడే రాబర్ట్ ఓనీల్.

By:  Tupaki Desk   |   17 Feb 2025 12:30 PM GMT
బిన్ లాడెన్ ను చంపిన సైనికుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా..?
X

పాకిస్థాన్ లో ఉన్న ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి నాటి అమెరికా ప్రెసిడెంట్ బరక్ ఒబామా పర్యవేక్షణలో సీల్స్ బృందం ఆపరేషన్ నెఫ్యూన్ స్పియర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాడెన్ ఉన్న గదిలోకి ప్రవేశించిన కమాండో.. బిన్ లాడెన్ కి బుల్లెట్లు దింపాడు.. కాల్చి చంపాడు. అప్పుడు అదొక సంచలన విషయం.

అయితే.. ఆ ఆపరేషన్ అనంతరం కొన్నాళ్లపాటు బిన్ లాడెన్ ను చంపింది ఎవరు అనే పేరు గోప్యంగా ఉంది. అయితే.. ఆ తర్వాత ప్రపంచానికి తెలిసిపోయింది. అతడే రాబర్ట్ ఓనీల్. ప్రస్తుతం అతడి వయసు 48 ఏళ్లు కాగా.. అమెరికా మెట్రో నగరమైన న్యూయార్క్ లో నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు అతడు గంజాయి దుకాణం నిర్వహిస్తున్నాడు.

అవును... ప్రపంచంలోనే కరుడుగట్టిన ఉగ్రవాది, ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ను కాల్చిచంపిన అమెరికా నేవీసీల్ కమాండో రాబర్ట్ ఓనీల్.. ఇప్పుడు న్యూయార్క్ నగరంలో ప్రభుత్వ లైసెన్స్ తో గంజాయి విక్రయించే దుకాణం నిర్వహిస్తున్నాడు. "ఆపరేటర్ కన్నా కో" పేరిట తన బ్రాండ్ విక్రయాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ సందర్భంగా స్పందించిన రాబర్ట్ ఓనీల్... సైన్యంలో ఉన్న అనుభవం, మాజీ సైనికులు తీవ్రమైన పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడటం చుసి తాను ఈ వ్యాపారంలోకి రావాలని నిశ్చయించుకొన్నట్లు తెలిపాడని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఇదే సమయంలో.. తన వ్యాపారం నుంచి వచ్చే అధిక ఆదాయాన్ని వికలాంగులైన మాజీ సైనికుల కోసం ట్రస్టుకు దానం చేస్తానని పేర్కొన్నాడు.

కాగా... పాకిస్థాన్ లోని అబోట్టాబాద్ మిలటరీ కంటోన్మెంట్ శివారులోని ఓ సురక్షిత ప్రాంతంలో ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నట్లు 2011లో అమెరికాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. దీంతో.. అతడిపై దాడి చేసేందుకు "ఆపరేషన్ నెఫ్యూన్ స్పియర్"కు నాటి అమెరికా ప్రెసిడెంట్ బరక్ ఒబామా పచ్చజెండా ఊపారు.

దీంతో.. రెండు బ్లాక్ హోక్ హెలీకాప్టర్లలో పాక్ రాడార్ సిగ్నల్స్ ను తప్పించుకొని 79మమంది కమాండోలు, ఓ కుక్క లాడెన్ ఇంటిని చుట్టుముట్టి, దాడి స్టార్ట్ చేశారు. ఈ సమయంలో ఆ ఇంటి పైన ఉన్న గదిలో ఉన్న లాడెన్ ను హతమార్చిన కమాండోలు.. డీఎన్ఏ పరీక్షల అనంతరం అతడి మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేశారు.