కూటమి సర్కార్ ప్రొగ్రెస్ రిపోర్ట్ రాబిన్ శర్మ చేతిలో !
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం జనవరి 12 నాటికల్లా ఏడు నెలలు పూర్తి చేసుకుని ఎనిమిదవ నెలలోకి ప్రవేశిస్తుంది.
By: Tupaki Desk | 31 Dec 2024 3:45 AM GMTఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం జనవరి 12 నాటికల్లా ఏడు నెలలు పూర్తి చేసుకుని ఎనిమిదవ నెలలోకి ప్రవేశిస్తుంది. ఒక విధంగా చెప్పాలీ అంటే కూటమి ప్రభుత్వం హానీమూన్ పీరియడ్ పూర్తిగా ముగిసిపోయినట్లే. ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఎక్కడ ఉన్నా మెల్లగా సన్నాయి నొక్కులతో బయటపడే అవకాశం ఉంది.
అది కాస్తా నెమ్మదిగా పెరిగి తొలి ఏడాది పూర్తి అయ్యేనాటికి ఒక రూపం సంతరించుకునే చాన్స్ ఉంటుంది. ఇది కేవలం టీడీపీ కూటమి సర్కార్ కే కాదు దేశంలో ఏ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నా జరిగే విషయమే. అయితే పెరిగిన అసంతృప్తి ఎక్కడ ఉంది, ఏ ఏ సెక్షన్లలో ఉంది అన్నది గుర్తించి దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ప్రభుత్వాలు చేయాల్సిన విషయం.
ఆ విషయంలో టీడీపీకి చంద్రబాబుకు ఎక్కడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన అధికారంలో ఉన్నా లేక విపక్షంలో ఉన్నా ఎపుడూ సర్వేలు నివేదికల మీద ఆధార పడుతూ ఉంటారు. వాటి ఆధారంగానే చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలా చూస్తే కనుక బాబు ఇపుడు మరోసారి గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ కోసం పవర్ ఫుల్ స్టడీని కోరుకుంటున్నారు.
నిజానికి బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాలలో ఇంటెలిజెన్స్ నివేదికలనే ఎక్కువగా తెప్పించుకుని వాటిని స్టడీ చేస్తూ ముందుకు వెళ్తారు. అయితే ఇపుడు వాటితో పాటుగా ఆయన పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మకు కూడా ఈ గురుతర బాధ్యతలను అప్పగించారని అంటున్నారు.
ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే అంతా బాగుంది అని ఫీల్ గుడ్ రిపోర్టునే ఎక్కువగా తెస్తూంటాయని అంటున్నారు. వారు ఇచ్చే వాటిలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగానే అంతా ఉంటుంది. ఆ విధంగా స్వామి భక్తితో ఇచ్చే నివేదికలను నమ్ముకునే గత వైసీపీ ప్రభుత్వం నిండా మునిగింది అని అంటున్నారు.
చంద్రబాబుకు ఈ విషయాలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన టీడీపీకి బంపర్ విక్టరీతో అధికారంలోకి తెచ్చిన రాబిన్ శర్మ మీద పూర్తి గురి ఉంచి బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. ఇపుడు రాబిన్ శర్మ రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలను బేరీజు వేయాల్సి ఉంటుంది. ఏడు నెలల కూటమి పాలన మీద కచ్చితమైన జనాభిప్రాయాన్ని కూడా పట్టాల్సి ఉంటుంది.
ఏ ఏ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయో కూడా గుర్తించి నిక్కచ్చిగా ఆ అభిప్రాయాలను క్రోడీకరించి పూర్తి స్థాయిలో నివేదికను టీడీపీ అధినాయకత్వానికి అందించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాబిన్ శర్మ టీం ఎంత నిర్మోహమాటంగా ఉంటే అంత గొప్పగా నిజాయతీగా ఫీడ్ బ్యాక్ ప్రభుత్వానికి అందుతుంది అని అంటున్నారు.
ఒక విధంగా చెప్పాలీ అంటే టీడీపీ కూటమి సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా రాబిన్ శర్మ చేతిలోనే ఉంది అని అంటున్నారు. రాబిన్ శర్మ ఇచ్చే రిపోర్టుని బేస్ చేసుకుని ఫ్యూచర్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీలో వైసీపీ ఏ మాత్రం బలపడకూడదన్న గట్టి పట్టుదలతో టీడీపీ జనసేన కలసికట్టుగా పనిచేస్తున్నాయి.
ఆ రకంగా వాతావరణం ఎక్కడైనా కనిపించినా కూడా దానిని మొగ్గలోనే తుంచేసే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అంటుంది. దానికి రాబిన్ శర్మ టీం ఇచ్చే నివేదికనే అత్యంత ప్రధానం అంటున్నారు. సో ఇపుడు రాబిన్ శర్మ టీం కీలకంగా మారోబోతోంది అన్న మాట.