మహిళలు మర్డర్ చేసిన శిక్ష ఉండకూడదు: రాష్ట్రపతికి ఎస్పీ నేత విన్నపం
మహిళలు హత్య చేసినా కూడా శిక్షలు పడకుండా మినహాయింపులు ఇవ్వాలని ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాసిన ఆమె తీరు చర్చనీయాంశమైంది.
By: Tupaki Desk | 8 March 2025 5:59 PM ISTనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ గ్రూప్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖ ఇప్పుడు దేశంలో సంచలనమైంది. మహిళలు హత్య చేసినా కూడా శిక్షలు పడకుండా మినహాయింపులు ఇవ్వాలని ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాసిన ఆమె తీరు చర్చనీయాంశమైంది.
ఆమె లేఖలో మహిళలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో, ఒక హత్యకు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మహిళలు ఆపద్దర్మ మనస్తత్వం, అత్యాచార దృక్పథం, అమాయకులను కాపాడలేని చట్ట వ్యవస్థను అంతమొందించాలనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.
మహిళలపై జరిగే నేరాలు పెరుగుతున్నాయని, ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఉదాహరణగా చూపించారు. "మేము, మహిళలందరి తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నం. ఒక హత్యకు శిక్ష నుంచి మినహాయింపు కోరుతున్నాము. అణచివేత వైఖరి.. రేపిస్ట్ మైండ్ సెట్, చైతన్యం లేని శాంతి భద్రతల పరిస్థితిని స్త్రీలు చంపాలని భావిస్తున్నారు." అని ఖడ్సే లేఖలో పేర్కొన్నారు.
ఆమె భారతదేశాన్ని మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా పేర్కొన్న ఓ సర్వే నివేదికను కూడా ప్రస్తావించారు. మహిళలపై అపహరణలు, గృహ హింస లాంటి నేరాలు జరుగుతున్నాయని అన్నారు. "మా డిమాండ్‌ను తీవ్రంగా పరిగణించి అంగీకరించాలని ఆశిస్తున్నాము," అని ఖడ్సే లేఖలో పేర్కొన్నారు.