భార్య ముందు అంకుల్ అన్నందుకు షాప్ కీపర్‌పై దాడి
కానీ బోపాల్ కి చెందిన రోహిత్ అనే వ్యక్తి తన భార్య ముందు ఒక షాప్ కీపర్ అంకుల్ అంటూ పిలిచినందుకు కోపం తెచ్చుకున్నాడు.
By: Tupaki Desk | 4 Nov 2024 5:24 PM GMTకొన్ని సార్లు చిన్న చిన్న విషయాలు సైతం పెద్దగా అనిపిస్తాయి, ఆ క్షణంలో విచక్షణ కోల్పోయి కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటీవల మధ్య ప్రదేశ్‌లోని బోపాల్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. అంకుల్ అన్నందుకు షాప్ కీపర్ ను దారుణంగా చితకొట్టిన సంఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భార్య ముందు అంకుల్ అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా అంటూ కొందరు అంటే మరి కొందరు మాత్రం అతడి తీరును విమర్శిస్తున్నారు.
సాధారణంగా ఒక ఏజ్ కు వచ్చిన తర్వాత అంకుల్ అంటే కొందరు తీసుకుంటారు, కొందరు మాత్రం తీసుకోలేరు. ముఖ్యంగా ఎదుటి వారు తమ కంటే కాస్త చిన్న అయినా, లేదంటే తక్కువ స్థాయి వారు అయినా అంకుల్ అంటే మాత్రం కోపం వస్తుంది. కొందరు ఆ కోపంను లోనే ఉంచుకుంటారు, కొందరు మాత్రం బయటకు అనేస్తారు. కానీ బోపాల్ కి చెందిన రోహిత్ అనే వ్యక్తి తన భార్య ముందు ఒక షాప్ కీపర్ అంకుల్ అంటూ పిలిచినందుకు కోపం తెచ్చుకున్నాడు. ఆ షాప్ కీపర్ తో గొడువకు దిగాడు. అక్కడి వారు నిలువరించడంతో అక్కడ నుంచి వెళ్లి కొద్ది సేపటి తర్వాత స్నేహితులతో కలిసి వచ్చి షాప్ కీపర్ ను చితకొట్టాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... రోహిత్ అనే వ్యక్తి భార్యతో కలిసి చీర కొనడానికి షాప్ కి వెళ్లాడు. అక్కడ షాప్ కీపర్ చీరలు చూపిస్తూ ఉన్నాడు. ఏ ధరలో చీరలు చూపించాలో చెప్పండి అంటూ షాప్ కీపర్ అడిగిన సమయంలో రోహిత్ తన గురించి తక్కువ అంచనా వేయవద్దని, ఎక్కువ మొత్తంలో ఉన్న చీరలను చూపించాల్సిందిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడాడు. అప్పుడు షాప్ కీపర్ మీ కోసం మరిన్ని చీరలు చూపిస్తాను అంకుల్ అన్నాడట. దాంతో నన్నే అంకుల్ అంటావా అంటూ గొడవకు దిగాడు.
షాప్ కీపర్ వి సర్ అని పిలవకుండా నన్ను అంకుల్ అంటావా అంటూ రోహిత్ తీవ్ర ఆగ్రహంతో అరిచాడు. అప్పుడు షాప్ లోని వారంతా రోహిత్ ను వారించారు. షాప్ సిబ్బంది రోహిత్ కి క్షమాపణలు చెప్పడం జరిగింది. గొడవ సర్దుమనిగింది అనుకున్న సమయంలో రోహిత్ బయట నుంచి తన స్నేహితులను తీసుకు వచ్చి షాప్ కీపర్ ను చావ చితక బాదాడు. దాంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. దాడికి పాల్పడ్డ రోహిత్, అతడి స్నేహితులపై షాప్ కీపర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. రోహిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. క్షణికావేశంలో రోహిత్ చేసిన పని చాలా దూరం తీసుకు వెళ్లింది.