Begin typing your search above and press return to search.

``బావ క‌ళ్ల‌లో ఆనందం కోసం``: పురందేశ్వ‌రిని త‌గులుకున్న రోజా

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు, రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని మాజీ మంత్రి, జ‌బ‌ర్ద‌స్త్ రోజా త‌గులు కున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 9:24 AM GMT
``బావ క‌ళ్ల‌లో ఆనందం కోసం``: పురందేశ్వ‌రిని త‌గులుకున్న రోజా
X

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు, రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని మాజీ మంత్రి, జ‌బ‌ర్ద‌స్త్ రోజా త‌గులు కున్నారు. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీపై న‌మోదైన కేసుల విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉండి.. మీడియా ముందుకు ఎందుకు వ‌చ్చార‌ని.. నెయ్యి కల్తీ అయిన‌ట్టు రుజువు ఉందా? అని కూడా ప్ర‌శ్నించారు. అయితే.. ఆయా ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ నేత‌ల నుంచి ఎలాంటి స‌మాధానాలు చెప్ప‌లేదు, విమ‌ర్శ‌లు కూడా చేయ‌లేదు.

కానీ, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి మాత్రం సీఎం చంద్ర‌బాబు మాట‌లు త‌ప్పులేద‌ని, ఆయ‌న త‌న‌కు అం దిన స‌మాచారం మేర‌కు మాట్లాడార‌ని.. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం కోర్టుల‌కు లేద‌ని వ్యాఖ్యానించా రు. నిబంధ‌న‌ల మేర‌కే చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించార‌ని కూడా పురందేశ్వ‌రి అన్నారు. అయితే.. ఆమె చేసి న వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా రియాక్ట్ అయ్యారు. పురందేశ్వ‌రిపై విరుచుకుప‌డ్డారు. ``బావ క‌ళ్ల‌లో ఆనందం కోసం`` అంటూ.. తీవ్ర వ్యాఖ్య‌లు సంధించారు.

కోట్లాది మంది హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్న స‌మ‌యంలో బావ క‌ళ్ల‌లో ఆనందం కోసం పురందేశ్వ రి.. సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల‌ను కూడా త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. హిందువుల ఆనం దం కంటే బావ(చంద్ర‌బాబు) క‌ళ్ల‌లో ఆనందం కోసం పురందేశ్వ‌రి త‌పిస్తున్నార‌ని రోజా ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగాఉన్న పురందేశ్వ‌రి.. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా మారిపోయార‌ని రోజా విమ‌ర్శించారు. బావ క‌ళ్ల‌లో ఆనందం కంటే భ‌క్తుల క‌ళ్ల‌లో ఆనందం చూసేందుకు ప్ర‌య‌త్నించాల ని ఆమె సూచించారు.

ప్రెస్‌మీట్ల ముందు చెబుతున్న మాట‌ల‌ను సుప్రీంకోర్టులో ఎందుకు చెప్ప‌లేక పోతున్నార‌ని రోజా నిల‌దీ శారు. మ‌త క‌ల్లోలాలు సృష్టించే దిశ‌గా అడుగులు వేశార‌ని అన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై విచారణ చేపట్టకుండానే సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రోజా అన్నారు. తప్పు చేశారు కాబట్టే.. పవన్ క‌ల్యాణ్‌తో దేవుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయించాడని తెలిపారు. నెయ్యి క‌ల్తీ విష‌యంపై భిన్నమైన ప్రకటనలు చేసిన టీటీడీ ఈవోను కూడా విచారించాల‌ని రోజా డిమాండ్ చేశారు.