Begin typing your search above and press return to search.

'పవర్ చేతిలో పెట్టుకుని నంగి ఏడుపులా?'... రోజా నిప్పులు!

అవును... ఏపీలో లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Nov 2024 5:45 PM GMT
పవర్  చేతిలో పెట్టుకుని నంగి ఏడుపులా?... రోజా నిప్పులు!
X

ఏపీలో లా అండ్ ఆర్డర్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హోంమంత్రి అనిత స్పందిస్తూ.. ఇది తనకు ఎంకరేజ్ మెంట్ వంటిదని చెప్పుకున్నారు! ఈ సమయంలో.. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం చేస్తున్నారని.. అనితను బలిపశువును చేసేలా ప్లాన్ చేస్తున్నారంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... “హోం మంత్రి అనితకు చెబుతున్నా.. బాధ్యత వహించండి.. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి.. గుర్తు పెట్టుకోండి.. ఇలానే ఉంటే హోం బాధ్యతలు తీసుకుంటాను” అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో స్పందించిన మాజీ మంత్రి ఆర్కే రోజా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... హోంమంత్రి సరిగా పనిచేయలేదని.. పవన్ అంటున్నారని.. అంటే.. ఓ దళిత మహిళ హోంమంత్రి కాబట్టి, మొత్తం ఆమె మెడకు చుట్టేసి, తప్పించుకోవాలనే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేస్తున్నాడనేది స్పష్టంగా అర్ధమవుతుందని అన్నారు.

ఇదే సమయంలో... అనిత ఫెయిల్యూర్ అయ్యిందని.. ఓ డమ్మీ పీస్ ని తీసుకొచ్చి హోంమంత్రిని చేశారని.. ఇప్పుడేమో ఆమె పనిచేయలేదని అంటే ఆమె ఏమి చేయగలదని ప్రశ్నించారు. డీజీపీ, హెచ్.ఓ.డీ. ఉన్న మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు... ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారని.. మరోపక్క లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడని.. అలాంటప్పుడు పరిస్థితులు ఇలానే ఉంటాయని తెలిపారు!

ఈ విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో తప్పులు చేసింది చంద్రబాబు, లోకేష్ లు అయితే.. వాళ్లపై పవన్ మాట్లాడటం లేదని.. కేవలం హోంమంత్రి పై మాత్రమే మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారని అన్నారు. వాస్తవానికి హోంశాఖలో మెజారిటీ భాగం చంద్రబాబు చేతుల్లోనే ఉందని.. ఈ సమయంలో రిజైన్ చేయమని చంద్రబాబుని పవన్ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.

పిఠాపురంలో ఎన్నో విషయాలు మాట్లాడిన పవన్.. అదే పిఠాపురంలో నెలన్నర క్రితం ఓ మైనర్ బాలికని, టీడీపీకి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేస్తే.. ఇంతవరకూ కనీసం ఆ కుటుంబాన్ని పవన్ పరామర్శించలేదని అన్నారు. ఇక పవన్ హోంమంత్రి కాదు.. రాష్ట్రం మొత్తాన్ని చూడలేనని చెబుతున్నారు.. పిఠాపురం ఎమ్మెల్యేనే కదా అని ప్రశ్నించారు.

ఇక డైవర్షన్ పాలిటిక్స్ పవన్ కల్యాణ్ చేస్తున్నారని.. మహిళనైన తాను రెండు సార్లు ఎమ్మెల్యే, ఓ సారి మంత్రి అయింత తనపైనా సోషల్ మీడియాలో ఎన్నో రాశారని.. ఆరోజు పవన్ కల్యాణ్ నోరు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు రోజా. "మేము మహిళలం కాదా.. మా ఇంట్లో వాళ్లు ఫీలవ్వరా.. ఈయనకు మాత్రమే కూతుళ్లు ఉన్నారా.. నా కూతురికి ఏ సంబంధం లేకపోయినా ఆమెపైనా కామెంట్లు చేశారు" అని ఫైర్ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే... పవర్ చేతిలో పెట్టుకుని నంగి ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడిన రోజా.. అసలు వాళ్లు అధికార పక్షంలో ఉన్నారా.. ప్రతిపక్షంలో ఉన్నారా అని ప్రశ్నించారు. హోంమంత్రి అనిత ఆఫ్ ద రికార్డ్స్ లో... గత ప్రభుత్వంలో చక్కగా పనిచేసిన వాళ్లు ఇప్పుడు ఎందుకు పనిచేయడం లేదని అడుగుతున్నారంటూ రోజా చెప్పుకొచ్చారు.