యూట్యూబ్ ఛానల్ పోల్స్ పై రోజా స్ట్రాంగ్ వార్నింగ్... విన్నట్లున్నారు?
తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Sep 2024 12:05 PM GMTతిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా యూట్యూబ్ ఛానల్ లో ఓ పోల్ నిర్వహించారని.. అందులో ఆమెకు షాకిచ్చేలా నెటిజన్లు స్పందించారని వార్తలు, వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... తిరుమల లడ్డూ వ్యవహారంలో ఆర్కే రోజా సెల్వమని అని ఉన్న యూట్యూబ్ ఛానల్ లో "తిరుమల లడ్డూ ముమ్మాటికీ టీడీపీ కుట్రే..?" (ఎస్ ఆర్ నో) అని ఒక ప్రశ్న.. అంతకంటే ముందు "వీరిలో తిరుమలలో ఎవరి పాలన బాగుంది?" అని నెటిజన్లను ప్రశ్నిస్తూ జగన్, చంద్రబాబుల ఫోటోలను పెడుతూ ఆప్షన్స్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు చంద్రబాబుకే ఎక్కువ మార్కులు వేసినట్లు రిజల్ట్ కనిపిస్తుంది!
ఇదే సమయంలో.. "తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది..?" అంటూ... చంద్రబాబు, పవన్, జగన్ ల ఫోటోలు పెడుతూ మూడు ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులోనూ నెటిజన్లు జగన్ వైపు వేలెత్తి చూపుతున్నట్లుగా రిజల్ట్ ఉంది! దీంతో... ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఇది రోజా సొంత యూట్యూబ్ ఛానల్ అని భావించి.. దీన్ని పలువురు షేర్ చేశారు. దీంతో... ఇది వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై రోజా స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని చెబుతూ.. తన పేరుమీద నడుస్తున్న ఆ ఛానల్స్, అకౌంట్ లను డిలీట్ చేయాలని హెచ్చరికలు చేశారు. అలా కానిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని రోజా వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎక్స్ లో స్పందించిన రోజా... "అందరికీ నమస్కారం! నా మిత్రులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు" అని మొదలుపెట్టి తన సోషల్ మీడియా అకౌంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో ఉండటానికి తాను ఉపయోగిస్తున్న ఫ్లాట్ ఫారమ్స్ వివరాలను వెల్లడించారు. అందులో యూట్యూబ్ లేదని తెలిపారు.
ఇందులో భాగంగా... ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, థ్రెడ్స్ మాత్రమే తాను వాడుతున్నట్లు రోజా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథయంలోనే తనకు అధికారిక యూట్యూబ్ ఛానల్ ఏదీ లేదనే విషయం దయచేసి గమనించాలని కోరారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటని ఆమె స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే... తన పేరుపై ఉన్న అకౌంట్లను, చానల్స్ ను వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపిన రోజా.. అలా కాని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకొబడతాయని వెళ్లడించారు. తన అధికారిక వెరిఫైడ్ అకౌంట్స్ (బ్లూటిక్ ఉన్నవి) లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులకు కోరుకుంటునాట్లు తెలిపారు.
అయితే... ఆమె ట్వీట్ చేసిన కాసేపటికే సదరు యూట్యూబ్ ఛానల్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఆ ఛానల్ దర్శనమివ్వడం లేదు!!