పవన్ ను ఎద్దేవా చేస్తూ ఛాలెంజ్ లు విసిరిన రోజా.. వైరల్ కామెంట్స్!
పవన్ పేరు చెబితే అంతెత్తున ఎగిరిపడే వైసీపీ నేతల్లో టాప్ లిస్ట్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఉంటారనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Nov 2024 10:23 AM GMTపవన్ పేరు చెబితే అంతెత్తున ఎగిరిపడే వైసీపీ నేతల్లో టాప్ లిస్ట్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఉంటారనే సంగతి తెలిసిందే. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఇటీవల విరుచుకు పడిన రోజా... ఇటీవల అసెంబ్లీ సాక్షిగా 34 మంది కేసులు నమోదయ్యాయని అనిత అసెంబ్లీలో చెప్పారంటు ఎక్స్ వేదికగా ఫైరయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రోజా.. పవన్ పై పిఠాపురం వెళ్దామనే ఛాలెంజ్ నుంచి 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నుంచి 2029 ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో పోటీల వరకూ పలు అంశాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు రోజా. ఇందులో భాగంగా... ఎద్దేవా చేస్తూ ఛాలెంజ్ లు విసిరారు.
అవును... గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా స్పందించిన రోజా.. ఎదైనా ఒక ఊర్లోకి తాను, సిద్ధార్ధ్ రెడ్డి, పవన్ కల్యాన్ పర్యటిద్దామని.. ఎవరిని చూసేందుకు జనం ఎక్కువమంది వస్తారో చూద్దామని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఈ వ్యాఖ్యలను తాజా ఇంటర్వ్యూలో ప్రస్థావించారు యాంకర్! దీమిపై రోజా ఆసక్తికరంగా స్పందించారు.
ఇందులో భాగంగా... తాను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నానని తెలిపారు. అయితే.. పిఠాపురంలో పవన్ కు భారీ మెజారిటీ వచ్చిందని యాంకర్ గుర్తు చేయగా.. ఇప్పుడు కూడా పిఠాపురంలో పర్యటించేందుకు తాను సిద్ధమని తెలిపారు. పిఠాపురంలో రేప్ కు గురైన అమ్మాయి ఇంటికి వెళ్దామని.. వరదలు వచ్చిన ముంపు ప్రాంతల్లో పర్యటిద్దామని రోజా అన్నారు.
ఇక రోజాకు ఓవర్ కాంఫిడెన్స్ ఎక్కువా అని యాంకర్ ప్రశ్నించగా... తాను గ్రౌండ్ రియాలిటీ చెబుతున్నానని.. 11 సీట్లు వచ్చిన జగన్ ను కామెంట్ చేసే ముందు పవన్ ఆలోచించుకోవాలని.. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన పవన్ రాజకీయ సన్యాసం తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు.
పవన్ ఒంటరిగా పోటీ చేసి గెలవాలని.. 2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయారని.. బీజేపీ, టీడీపీ బలంతోనే 2024 ఎన్నికల్లో గెలిచారని అన్నారు. తాను మాత్రం నగరిలో రెండు సార్లు ఓడిపోయినా.. సొంతంగా పోటీ చేశానని.. ఈ రోజు ఓడినా రేపు గెలవగలన్న ధీమా ఉందని.. పవన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని ఆమె ఛాలెంజ్ విసిరారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ సొంత బలాన్ని ప్రశ్నిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.