Begin typing your search above and press return to search.

ఆర్కే రోజా ట్వీట్ వెనుక అర్థమేమిటి?... నెట్టింట కొత్త చర్చ!

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీసింది.

By:  Tupaki Desk   |   2 March 2025 7:04 AM GMT
ఆర్కే రోజా ట్వీట్  వెనుక అర్థమేమిటి?... నెట్టింట కొత్త చర్చ!
X

మాజీ మంత్రి ఆర్కే రోజా... ఏపీ రాజకీయాల్లో సంచలనమే చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన రోజా.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే అంతెత్తున లేచి పడిపోయేవారిలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీసింది.


అవును... హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన రోజా.. ఆ తర్వాత కాలంలో టీడీపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ సమయంలో చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. ఈ సమయంలో నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో మంత్రిగానూ పని చేశారు.

ప్రధానంగా వైసీపీలో చేరిన తర్వాత రోజా చేసే వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే వైసీపీలోనే ఆమెకు వ్యతిరేక వర్గం కూడా బలంగా ఉందని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా రోజా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "హెల్ప్" అనేది చాలా విచిత్రమైంది. చేస్తే మరచిపోతారు.. చేయకపోతే గుర్తుపెట్టుకుంటారు.. అని రోజా ట్వీట్ చేశారు.

దీంతో.. ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... రోజాకు జగన్ హ్యాడిస్తున్నారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ పార్టీలో ఆమె స్థాయిని తగ్గించేశారనడానికి సంకేతమా అనే అనుమానాలు తెరపైకి వచ్చాయని అంటున్నారు. ప్రధానంగా... నగరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా రోజా స్థానంలో గాలి జగదీశ్ కు బాధ్యతలు ఇవ్వబోతున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే విషయాన్ని రోజాకు వైసీపీ అధినేత జగన్ క్లియర్ గా చెప్పేశారని.. ఆ కారణంగానే, తాను పార్టీకి ఎంతో హెల్ప్ చేసినా... అనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ ఆ హెల్ప్ ను జగన్ మరిచిపోయారు అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారా అనే చర్చ మొదలైందని చెబుతున్నారు. దీంతో... రోజా చేసిన ఈ "హెల్ప్" ట్వీట్ ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరి.. దీనిపై రోజా ఏమైనా వివరణ ఇస్తారా.. లేక, కాలానికీ, ఊహాగాణాలకే వదిలేస్తారా అనేది వేచి చూడాలి!