వైసీపీకి షాకిచ్చేలా రోజా డెసిషన్ ?
ఆమె రాజకీయాలకు గుడ్ బై చెబుతారు అని ఒక ప్రచారం ఉంటే ఆమె కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండి సరైన సమయంలో మళ్ళీ రాజకీయ తెర మీద ఎంట్రీ ఇస్తారు అని కూడా అంటున్నారు.
By: Tupaki Desk | 11 Aug 2024 3:36 AM GMTఆర్కే రోజా. తెలుగు రాష్ట్రాలలో ఆమె సీనియర్ నటీమణి. ఒకనాటి గ్లామర్ హీరోయిన్. ఆ మీదట గత రెండు దశాబ్దాలుగా చూస్తే సీరియస్ పొలిటీషియన్. రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన ఓడిన రోజా మూడు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసి అందులో వరసగా రెండు సార్లు గెలిచారు. వైసీపీ 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చాక చివరి రెండేళ్ళూ కేబినెట్ మంత్రి అయ్యారు.
రోజా అంటే ఫైర్ బ్రాండ్. ఆమె ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా లేక విపక్షంలో ఉన్నా తనదైన శైలిలో ప్రత్యర్ధుల మీద విరుచుకుపడేవారు. ఆమె పేల్చే డైలాగులు డైనమైట్ల మదిరిగా ప్రత్యర్ధులకు తాకేవి. రోజా నాన్ స్టాప్ గా మీడియా ముందు మాట్లాడడంలో ఎక్స్ పెర్ట్.
ఆమె తాను ఉన్న పార్టీని కాసుకోవడంలోనూ దిట్ట. ఇక ఆమె ప్రత్యర్ధులను లైట్ తీసుకోవడమే కాదు వారిని విమర్శించడంతో ఎందాకైనా వెళ్తారు. అలా రోజా వైసీపీకి ఒక విధంగా అసెట్ మరో విధంగా చూస్తే మైనస్. విపక్షంలో ఆమె ఉన్నపుడు వైసీపీకి ఆయుధంగా ఉన్నారు. అదే అధికారంలో ఉన్నపుడు అదే దూకుడు కొనసాగించడం ద్వారా మైనస్ అయ్యారు.
వైసీపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి కాదు డిజాస్టర్ రిజల్ట్ తో పూర్తిగా చతికిలపడి పోయింది. దాంతో ఫైర్ బ్రాండ్ రోజా లాంటి వారు అయితే ఏమీ మాట్లాడటం లేదు. ఫుల్ సైలెంట్ అయిపోయారు. దాంతో ఆమె పొలిటికల్ రూట్ ఏమిటి అన్న చర్చ ఒక వైపు జోరుగా సాగుతోంది.
ఆమె రాజకీయాలకు గుడ్ బై చెబుతారు అని ఒక ప్రచారం ఉంటే ఆమె కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండి సరైన సమయంలో మళ్ళీ రాజకీయ తెర మీద ఎంట్రీ ఇస్తారు అని కూడా అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే రోజా గురించి మరో బాంబు లాంటి వార్త బయటకు వస్తోంది.
అదేంటి అంటే ఆమె తెలుగు రాజకీయలకు పూర్తిగా స్వస్తి పలికి తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు అని. ఆమె భర్త ఆర్కే సెల్వమణిది తమిళనాడు. దాంతో పాటు ఆయన అక్కడ సీనియర్ దర్శకుడు. ఆయన మూలాలు అన్నీ అక్కడే ఉన్నాయి. దాంతో తన భార్యను తమిళనాట పాలిటిక్స్ లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు అని అంటున్నారు.
తమిళ హీరో విజయ్ ఒక పార్టీ పెట్టారు. తమిళనాడు అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో గ్లామర్ తో పాటు మంచి వాగ్దాటి ఉన్న రోజాను ఆ పార్టీలో చేర్పించడం ద్వారా ఆర్కే సెల్వమణి తన సొంత నియోజకవర్గం నుంచి రోజాను పోటీకి దించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ మేరకు విజయ్ తో చర్చిస్తున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
రోజా చూస్తే ఓటమి తరువాత మకాం మొత్తం తమిళనాడుకే మార్చేశారు అని అంటున్నారు. ఆమెకు తమిళానాడులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె సినిమాలు అక్కడా చేశారు. అయితే రోజా తమిళ సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్నారు అని ఒక ప్రచారం సాగింది. ఇపుడు దాని కంటే పెద్ద వార్తగా ఇది బయటకు వచ్చింది.
దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. టీడీపీని విభేదించి వచ్చిన రోజా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్ళలేరు. వైసీపీలో కూడా ఆమెకు స్వపక్షంలో విపఖంగా ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఆమె పోటీ చేసి రెండు సార్లు గెలిచిన నగరి ఎప్పటికీ ఆమె సొంత సీటు కాదని తాజా ఎన్నికల్లో తేలిపోయింది.
మరో సీటు చూసుకుని పోటీ చేసి గెలిచి రావడం అన్నది జరిగే పని కాదు, ముఖ్యంగా చిత్తూరు జిల్లా వైసీపీ పెద్ద లీడర్లతో ఆమెకు ఉన్న విభేదాలతో రాజకీయంగా ఆమెకు చాన్స్ దక్కదనే అంటున్నారు. వైసీపీ తీరు కూడా ఏమీ బాగా లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో పాలిటిక్స్ కూడా ఆమెకు ఏమంత ఆశాజనకంగా లేదు అని అంటున్నారు. సినీ ఫీల్డ్ లోనూ ఆమెకు ఇప్పట్లో చాన్సులు ఇచ్చే అవకాశాలు లేవు అని అంటున్నారు.
దాంతో తమిళనాడు కోడలిగా అక్కడే తన ఫ్యూచర్ పాలిటిక్స్ కి తెర తీయాలని ఆమె చూస్తున్నారుట. ఈ పుకార్లు నిజం అయితే మాత్రం రోజాది రైట్ డెసిషన్ అని అనుకోవాల్సి ఉంటుంది. విజయ్ పార్టీ కొత్తది. రాజకీయ అనుభవం కలిగిన నేతగా మాజీ మంత్రిగా రోజా ఆ పార్టీ తరఫున అరంగేట్రం చేస్తే లక్ బాగుంటే ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. సో రోజా ఏపీకి గుడ్ బై చెబుతున్నారు అన్న వార్తలలో నిజమెంత అన్నది చూడాల్సి ఉంది.