Begin typing your search above and press return to search.

వాటిని వండి వార్చారు: ఎగ్జిట్ పోల్స్‌పై రోజా రియాక్ష‌న్‌

వీటిలో కొన్ని టీడీపీ కూట‌మికి అనుకూలంగా మ‌రికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   3 Jun 2024 9:29 AM GMT
వాటిని వండి వార్చారు:  ఎగ్జిట్ పోల్స్‌పై రోజా రియాక్ష‌న్‌
X

ఏపీలో మ‌రికొన్ని గంట‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. గ‌త నెల 13న జ‌రిగిన హోరా హో రీ ఎన్నిక‌ల స‌మ‌రంలో ఎవ‌రు గెలుస్తున్నారు? ఎవ‌రు ఓడుతున్నార‌నే విష‌యాల‌పై స‌ర్వ‌త్రా న‌రాలు తెగే ఉత్కంఠ నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలోనే దాదాపు 40కిపైగా సర్వే సంస్థ‌లు ఎవ‌రు గెలుస్తార‌నే విష‌యా ల‌పై అంచ‌నాలు విడుద‌ల చేశాయి. వీటిలో కొన్ని టీడీపీ కూట‌మికి అనుకూలంగా మ‌రికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.

అయితే.. టీడీపీకి అనుకూలంగా ఉన్న వాటిలో ప్ర‌తిష్టాత్మక ఇండియా టుడే మై యాక్స‌స్ వంటివి కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎగ్జిట్ పోల్స్ పై అనేక చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మరీముఖ్యంగా జాతీయస్థాయిలో జ‌రిగిన స‌ర్వేల్లో ఏపీలో వైసీపీకి పార్ల‌మెంటు స్థానాలు చాలా చాలా త‌క్కువ‌గా ఇచ్చాయి. ఈ ప‌రిణామా ల‌పై రాజ‌కీయంగా నాయ‌కులు మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఉద్దేశ పూర్వకంగా చేయించుకున్నార‌ని.. ఎన్డీయే కేంద్రంలో ఉంది కాబ‌ట్టి.. దానికి అనుకూలంగా ఇచ్చార‌ని ఇలా అనేక విశ్లేష‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి.

ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. వైసీపీ మంత్రి రోజా స్పందించారు. టీడీపీకి అనుకూ లంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్‌పై ఆమె స్పందిస్తూ.. వాటిని వండి వార్చిన స‌ర్వేలుగా పేర్కొన్నారు.. కూట‌మికి ఉద్దేశ పూర్వ‌కంగానే వీటిని తీసుకువ‌చ్చార‌ని, గ్రౌండ్ లెవిల్ రియాలిటీని ప‌సిగ‌ట్ట‌లేద‌ని చెప్పారు. ``వారి వారి సొంత క‌థ‌నాల‌ను స‌ర్వేల రూపంలో తీసుకువ‌చ్చారు. వీటిలో రియాలిటీ లేదు`` అని రోజా చెప్పారు.. అంతేకాదు.. వాస్త‌వం ఏంటో జూన్ 4న తేలిపోతుంద‌ని అన్నారు. వైఎస్ జ‌గ‌న్ తిరిగి ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు.

ఇదిలావుంటే.. ఇత‌ర సంస్థ‌లు ఎలా ఉన్నా.. కొంత విశ్వ‌సనీయ స‌ర్వేగా పేరున్న ఆరా మ‌స్తాన్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైసీపీకి అనుకూలంగా వ‌చ్చింది. 94-104 స్థానాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని ఈ స‌ర్వే తేల్చి చెప్పింది. దీనిపైనా టీడీపీ నాయ‌కుడు బుద్ధా వెంక‌న్న స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే. కూట‌మి అధికారంలోకి రాక‌పోతే.. నాలుక కోసుకుంటాన‌ని ఆయ‌న అన్నారు. వైసీపీ రాక‌పోతే.. మ‌స్తాన్ నాలుక కోసుకుంటారా? అని ప్ర‌శ్నించారు.