సోనియా వల్లే కాలేదు... పవన్ కు ఇచ్చిపడేసిన రోజా!
ఇంక జగన్ ని ఏమి ఆడిస్తాడంటూ ర్యాగింగ్ మొదలుపెట్టారు. ఇదే సమయలో సోనియా గాంధీ టాపిక్ ఎత్తి పవన్ గాలి తీసేశారు రోజా!
By: Tupaki Desk | 12 Aug 2023 5:46 AM GMTవారహి యాత్ర 3.0 ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు అంతా ఊహించినట్లుగానే ఈ యాత్ర సాగుతుందని అంటున్నారు. ఈ సమయంలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంతో చెప్పి జగన్ సంగతి తేలుస్తానంటూ ఫైరవుతున్నారు. ఈ సమయంలో రోజా స్పందించారు.
అవును... విశాఖలో పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ తాను నటించిన "బ్రో" సినిమానే నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయాడు.. ఇంక జగన్ ని ఏమి ఆడిస్తాడంటూ ర్యాగింగ్ మొదలుపెట్టారు. ఇదే సమయలో సోనియా గాంధీ టాపిక్ ఎత్తి పవన్ గాలి తీసేశారు రోజా!
జగన్ ని ఆడించాలన్నా, ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా వల్లే కాలేదు.. అలాంటిది చంద్రబాబు ఆడుతున్న ఆటలో అరటిపండు లాంటి పవన్ ఏమి ఆడిస్తాడంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ప్రజలకోసం పార్టీ పెట్టలేదు.. చంద్రబాబు కోసం పార్టీ పెట్టాడు అంటూ మంత్రి రోజా ఫైరయ్యారు.
అలాంటి జెండా, అజెండా లేని వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా అని అడిగిన రోజా... ప్రజల మద్దతు లేకుండా జగన్ ఏమి ఆడిస్తాడంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి రోజా ఒక సవాల్ విసిరారు. అది కూడా లైఫ్ టైం సవాల్ కావడం గమనార్హం.
ఇప్పటికే 55 ఏళ్లు వచ్చాయి.. ఇంకో 45 ఏళ్లు సమయం ఇస్తున్నాను.. అంటూ మొదలుపెట్టిన రోజా.. నీ జీవితకాలంలో జగన్ చిటికిన వేళు మీదున్న వెంట్రుక కూడా పీకలేవని సవాల్ విసిరారు. ప్రజలకు ఇచ్చిన మాటకోసం జగన్ ఎన్నో అవమానాలు పడ్డారని ఈ సందర్భంగా రోజా గుర్తుచేశారు!
ఇదే సమయంలో చంద్రబాబుకి విశ్వాసపాత్రమైన జీవిగా పవన్ బ్రతుకుతున్నాడని చెప్పిన రోజా... ఇచ్చిన ప్యాకేజీకి న్యాయం చేయడానికి పవన్ ముందుకు వెళ్తున్నాడని అన్నారు. ఇందులో భాగంగా... చంద్రబాబు కరవమంటే కరవడం, మొరగమంటే మొరగడం పవన్ పని అని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు జగన్ కారణం అంటూ పవన్ చేసిన కామెంట్స్ పై రోజా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఅర్ వల్ల వచ్చిందని అంతా అనుకుంటుంటే... కాదు కాదు జగన్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని పవన్ ఎందుకు అంటున్నాడో ఆయనే తెలియాలని రోజా అన్నారు.
ఇదే సమయంలో జగన్ కి దనదాహం ఎక్కువ, ఆయన ఆంధ్రా వీరప్పన్ అన్నట్లుగా పవన్ చేసిన వ్యాఖ్యలపైనా రోజా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి.. వీరప్పన్ కాదు కానీ, పవన్ కల్యాణ్ మాత్రం నారావారి కోసం కష్టపడుతున్న నారప్ప అని అన్నారు. వీరప్పన్ ఎర్రచందనం కోసం పుడితే... పవన్, చంద్రబాబు కోసం పుట్టాడని అన్నారు.