‘ఓయో’.. మీకు పెళ్లి కాలేదా?.. హోటల్ రూమ్ లేనట్లే..
ముఖ్యంగా పెళ్లి కాని యువతీ యువకులు ఓయోలో రూమ్ బుక్ చేసుకోవడం.. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నవారు బుక్ చేసుకోవడం.. తదితర కారణాలతో ఓయో అంటే వేరే విధంగా అర్థం చేసుకోవడం మొదలైంది.
By: Tupaki Desk | 5 Jan 2025 5:30 PM GMTఈ కామర్స్ కార్యకలాపాల వేగం పెరుగుతున్న కొద్దీ అనేక మార్పులు.. హారం.. వస్తువులు.. ఇలా ఏది కావాలంటే అది బుక్ చేస్తే చాలు ఇంటి ముంగిటకే సరుకులు.. సరిగ్గా దీనినే హోటల్ బుకింగ్ రంగంలోకి తీసుకొచ్చింది ఓ సంస్థ. ఆ ఆలోచనను చూసినవారు ‘ఓయో’ అని ఆశ్చర్యపోయారు. దీనిని ఓ విప్లవంగా అభివర్ణించారు. అయితే, ఇదే సమయంలో విమర్శలు కూడా వచ్చాయి. కొందరు దీనిని అవకాశం తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి కాని యువతీ యువకులు ఓయోలో రూమ్ బుక్ చేసుకోవడం.. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నవారు బుక్ చేసుకోవడం.. తదితర కారణాలతో ఓయో అంటే వేరే విధంగా అర్థం చేసుకోవడం మొదలైంది.
కొత్త చెక్ ఇన్ పాలసీ..
హోటల్ లోకి ప్రవేశంచడాన్ని చెక్ ఇన్ అంటారు. బయటకు రావడాన్ని చెక్ ఔట్ అంటారు. చెక్ ఇన్ సమయంలో హోటల్ కు సంబంధించి పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అగ్రిగేటర్ గా బుకింగ్ కు సంబంధించి ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త చెక్ ఇన్ విధానంలో ఏడాదిలో అమల్లోకి వచ్చే మార్గదర్శకాలను పరిచయం చేసింది.
పెళ్లికాని వారికి చుక్కెదురే
మీకు పెళ్లి కాలేదా..? అయిన్పటికీ జంటగా రూమ్ బుకింగ్ కు ప్రయత్నిస్తున్నారా? అయితే, ఓయోలో ఇకమీదట అలా కుదరదు. ఈ నిబంధనను తొలుత యూపీలోని మేరఠ్ నుంచి ప్రారంభించనుంది.
కొత్త చెక్-ఇన్ పాలసీ ఆధారంగా.. ఇకపై ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో అయినా రూమ్ బుకింగ్ సమయంలో అన్ని జంటలు వివాహ రుజువును సమర్పించాలి. అంటే.. పెళ్లిని నిర్ధారించే గుర్తింపు కార్డులను చూపాలి. ఇంకో ముఖ్య విషయం ఏమంటే.. ఏ సందర్భంలో అయినా ఇలాంటి బుకింగ్ లను తిరస్కరించే విచక్షణ అధికారం ఓయో తన పార్ట్ నర్ షిప్ లోని హోటళ్లకు అందించింది. ప్రస్తుతానికి మేరఠ్ లోనే తీసుకొచ్చినా ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ విధానాన్ని మరిన్ని నగరాలకు విస్తరించొచ్చు. కాగా, ఏమేం రూమ్ బుకింగ్ కు ఏమేం ఆధారాలు ఇవ్వాలనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
సురక్షిత ఆతిథ్యం..
సురక్షిత, బాధ్యతాయుత ఆతిథ్య పద్ధతుల అమలుకు ఓయో కట్టుబడి ఉందని.. యాప్ ఉత్తర భారత విభాగాధిపతి పవాస్ శర్మ తెలిపారు. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షిత వసతులు అందించే బ్రాండ్ తమది కావాలని పేర్కొన్నారు. ఖాతాదారుల్లో దీనివల్ల నమ్మకం పెరిగి, బుకింగ్ లు పెరుగుతుందన్నారు.