Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి అనిల్.. వారందరినీ జనసేనలోకి పంపుతున్నారా?

అవును... మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఆయన సొంత బాబాయి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 4:30 PM GMT
మాజీ మంత్రి అనిల్.. వారందరినీ జనసేనలోకి పంపుతున్నారా?
X

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఆయన సొంత బాబాయి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను జనసేనలోకి పంపిస్తున్నారంటూ కీలక ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికవ్వడానికి గల కారణాలను వివరించారు.

అవును... మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఆయన సొంత బాబాయి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... నెల్లూరు ఫతేఖాన్ పేటలోని కూల్ డ్రింక్స్ షాపులో పనిచేసుకునే అనీల్.. ఎమ్మెల్యే ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు.

ఇదే సమయంలో... నెల్లూరు జిల్లాను అనిల్ కుమార్ నాశనం చేశారని.. ఇటీవల టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లను ఎక్స్ ట్రా ఆర్టిస్టులు అన్నట్లుగా అనీల్ మాట్లాడారని.. పెయింట్లు వేసుకునేవాళ్లు, ఉప్పు అమ్ముకునేవాళ్లు కార్పొరేటర్లు కాకూడదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ నెల్లూరు కార్పొరేటర్లు కష్టపడి రక్తాన్ని చెమటగా మారిస్తేనే అనిల్ రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని అన్నారు. 17 ఏళ్లు షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేసిన వ్యక్తికి అదే పోస్టును రూ.7 లక్షలకు అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అసలు నెల్లూరు సిటీలో అనిల్ ఉత్సవ విగ్రహంగా ఉంటే.. రాజకీయాలు చేసింది తామేనని రూప్ కుమార్ అన్నారు.

టీడీపీలోకి వెళ్తున్న వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి వద్దు, జనసేనలోకి వెళ్లామని అనిల్ చెబుతున్నారని.. కార్పొరేటర్ల విషయంలో అనీల్ వైసీపీకి వెన్నుపోటు పొడుస్తున్నారని రూప్ కుమార్ విమర్శించారు. కార్పొరేటర్లను చెన్నైకి పిలిచి జనసేనలోకి వెళ్లాలని చెప్పారని.. దీనిపై ప్రమాణం చేయడానికి సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.

ఇక వైసీపీ హయాంలో మంత్రి నారాయణపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని.. పైగా, తాము కక్ష సాధింపులకు పోలేదని ఎక్స్ ట్రా ఆర్టిస్ట్ చెప్పడం విడ్డూరంగా ఉందని రూప్ కుమార్ ఎద్దేవా చేశారు! అసలు గత ప్రభుత్వ హయాంలో మంత్రి నారాయణపై పెట్టినన్ని కేసులు ఎవరిమీదా లేవని.. అయినప్పటికీ ఈ వేధింపులు తట్టుకుని 72వేల మెజారిటీతో నారాయణ గెలిచారని ఆయన గుర్తు చేశారు.