Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి ఆఫర్ ను ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు కాదన్నారు?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఏ పార్టీలో చేరతారోననే ఉత్కంఠ కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   17 March 2024 9:39 AM GMT
రేవంత్ రెడ్డి ఆఫర్ ను ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు కాదన్నారు?
X

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఏ పార్టీలో చేరతారోననే ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ లో చేరతారనే వాదనలు వచ్చినా అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఆఫర్ ఇస్తోంది. దీంతో ఆర్ఎస్పీ ఎందులో చేరతారోననే కోణంలో అనుమానాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆర్ఎస్పీ నిర్ణయం ఏం తీసుకుంటారో? ఏ పార్టీలో చేరతారోననే మీమాంస కొనసాగుతోంది. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎటు వైపు వెళతారో తెలియడ లేదు.

ప్రవీణ్ కుమార్ సర్వీసులో డీజీపీ అయ్యేవారు. రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. బీఎస్పీని ముందుండి నడిపిస్తారని అంతా అనుకున్నారు. ఇలా అర్థంతరంగా పార్టీని వదిలేసి బయటకు వస్తారని ఊహించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ కుమార్ కు బంపర్ ఆఫర్ ఇస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ను ఆయన కాదనడం గమనార్హం.

టీఎస్ పీఎస్ సీ చైర్మన్ పదవి ఇస్తామని చెబుతోంది. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్పీ స్థాయిని గుర్తించి తమ పార్టీలో చేరాలని కోరినా సున్నితంగా తిరస్కరించారు. అధికార పార్టీలో ప్రవీణ్ చేరితే బలం మరింత పెరుగుతుందని భావించినా కుదరలేదు. దీంతో ఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటారోననే సందేహాలు వస్తున్నాయి. రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారనే కోణంలో పలువురు ఆరా తీస్తున్నారు.

ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరితే ఆయనకే నష్టం కలుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో చేరితో పోరాటాలు చేసినా ప్రయోజనం దక్కదు. అధికార పార్టీ అయితే పనులు సులభంగా అవుతాయి. కానీ ఆర్ఎస్ మదిలో ఏముందో అంతుచిక్కడం లేదు. ఐపీఎస్ తెలివి రాజకీయాల్లో అంతగా పనిచేయదు. అందుకే ఆయనకు రాజకీయ అనుభవం లేమి స్పష్టంగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి పోటీలో ఉండాలని భావించిన ప్రవీణ్ కుమార్ హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక ఏదైనా మంత్రాంగం జరిగిందా అనే కోణంలో కూడా ఆలోచనలు వస్తున్నాయి. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్పీ ఇలా రాజీనామా చేయడంపై భిన్నాభిప్రాయాలు రావడం సహజమే.