ఆరెస్సెస్ కి వందేళ్లు...బీజేపీ అజెండా అదేనా ?
అయితే అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అందరూ ఒక్కటిగా ఉండాలన్నదే తమ విధానం అని ఆరెస్సెస్ ఇటీవల కాలంలో అనేక సార్లు స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 13 July 2024 3:15 AM GMTరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని 1925లో స్థాపించారు. సరిగ్గా 2025 నాటికి వందేళ్ళు పూర్తి అవుతాయి. ఒక శతాబ్దం పాటు ఒక సంస్థ నడపడం అంటే మామూలు విషయం కాదు, పైగా ఈ రోజుకీ ఆరెస్సెస్ ఒక డిబేటింగ్ పాయింట్ గా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఉంది.
ఆరెస్సెస్ కి ఉన్న రాజకీయ అంగమే బీజేపీ అని చెబుతారు. ఆరెస్సెస్ లక్ష్యం హిందూ రాష్ట్రం అని కూడా అంటారు. అయితే అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అందరూ ఒక్కటిగా ఉండాలన్నదే తమ విధానం అని ఆరెస్సెస్ ఇటీవల కాలంలో అనేక సార్లు స్పష్టం చేసింది. అదే విధంగా హిందూత్వ భావన అంటే అది ఒక జీవన విధానం తప్ప మతం కాదని కూడా ఆరెస్సెస్ ప్రముఖులు వాదిస్తూ వచ్చారు
మరో వైపు చూస్తే దేశానికి స్వాతంత్రం లభించడానికి 22 ఏళ్ల ముందు ఏర్పాటు అయిన ఆరెస్సెస్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళ నుంచి దేశంలో అత్యదిక వర్గంగా ఉన్న హిందువుల కోసం పనిచేస్తూ వస్తోందని అంటారు. అయితే ఈ ప్రపంచంలో హిందువులకు నివాస యోగ్యమైనది వారు ఉండగలిగేది ఏకైక దేశం భారత్ తప్ప మరోటి కాదు అన్నది ఆరెస్సెస్ భావనగా కూడా చెబుతారు.
ఆరెస్సెస్ హిందూ రాష్ట్రం అన్నది గతంలో ఎక్కడైనా మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఇటీవల కాలంలో ఆ ప్రస్తావన తేవడం లేదు. కానీ వామపక్షాలు మాత్రం ఆరెస్సెస్ గురించి మాట్లాడుతూ బీజేపీ చేయబోయే కార్యక్రమాలు గురించి కూడా చెబుతూ ఉంటారు.
విజయవాడలో తాజాగా జరిగిన సీపీఎం విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ 2025 నాటికి ఈ దేశాన్ని హిందూ రష్త్రంగా మార్చాలన్నదే బీజేపీ అజెండా అని ఆరోపిస్తున్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ ఎం ఏ బేబీ మాట్లాడుతూ హిందూ రాష్ట్రం అన్న ఆలోచనలు ఆరెస్సెస్ లో ఉన్నాయని వాటిని సాకారం చేసే పనిలో బీజేపీ ఉందని అంటున్నారు.
అందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారని 2025 నాటికి ఆరెస్సెస్ వందేళ్ల మైలు రాయిని దాటిన వేళ బీజేపీ భారత్ ని అఖండ హిందూ దేశంగా మారుస్తుందని సంచనల కామెంట్స్ చేశారు. బీజేపీ 2024 ఎన్నికలను కేవలం మత రాజ్య నిర్మాణం కోసమే ఉపయోగించుకోవాలని చూసింది అని అన్నారు. అయినా ఆ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీని ప్రజలు ఇవ్వలేదని అన్నారు.
మరో వైపు విపక్ష కూటమిలో అనైక్యత బీజేపీకి కలసి వస్తోందని సీపీఎం నేతలు అంటున్నారు. ఆప్ కాంగ్రెస్ ల మధ్య కూర్చుని మాట్లాడుకునే అవకాశాలు లేవని అలాగే ఇతర విపక్షల మధ్య ఎందుకో గ్యాప్ కనిపిస్తోందని అంటున్నారు. ఈ రకమైన వాటిని బీజేపీ అడ్వాంటేజ్ గా మార్చుకుంటోందని అన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే కేంద్రంలో సొంతంగా మెజారిటీ సాధించలేని బీజేపీ హిందూత్వ దేశంగా మారుస్తుందని అనుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ జేడీయూలు సెక్యూలర్ భావ జాలం కలిగినవి. అందువల్ల ఆ పార్టీలు ఊరుకోవు అన్న మాట ఉంది. ఏది ఏమైనా ఆరెస్సెస్ ఒక మైలు రాయిని అందులో శతాబ్దిని దాటుతున్న నేపధ్యంలో దేశంలో ఏమైనా సంచలనలు నమోదు అవుతాయా అంటే ఏడాది పాటు వేచి చూడాల్సిందే అని అంటున్నారు.