Begin typing your search above and press return to search.

92 వయసులో..మీడియా టైకూన్ కు ఐదో పెళ్లి

ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన మీడియా టైకూన్ రూబర్ట్ మర్డోక్ తాజాగా ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు. 92 ఏళ్ల వయసున్న మర్డోక్ 67 ఏళ్ల వయసున్న తన స్నేహితురాలు జుకోవోను వివాహమాడబోతున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2024 2:55 PM GMT
92 వయసులో..మీడియా టైకూన్ కు ఐదో పెళ్లి
X

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రేమకు వయసు లేదు అంటూ పాతికేళ్ల వయసున్న యువతులు...60 ఏళ్ల వయసున్న అంకుల్స్ ని కూడా పెళ్లి చేసుకుంటున్న ఘటనలు అనేకం ఉన్నాయి. బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ ఈ కోవలేకో వస్తారు. ఇక, మరికొందరు కోటీశ్వరులైతే ఏడు పదుల వయసు సమీపిస్తున్న తరుణంలో కూడా పడుచు పిల్లలు కావాలని పెళ్లి చేసుకుంటుంటారు. చాలాచోట్ల డబ్బే ప్రధానంగా ఉంటుంది.

ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన మీడియా టైకూన్ రూబర్ట్ మర్డోక్ తాజాగా ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు. 92 ఏళ్ల వయసున్న మర్డోక్ 67 ఏళ్ల వయసున్న తన స్నేహితురాలు జుకోవోను వివాహమాడబోతున్నారు. వీరిద్దరి ఎంగేజ్మంట్ జరిగింది. ఈ ఏడాది జూన్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. గత ఏడాది డెంటల్ హైజినిస్ట్ స్మిత్ తో మర్డోక్ కు నిశ్చితార్థం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ నెలరోజుల్లోనే మర్డోక్ ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. రష్యాకు చెందిన జుకోవ్ అమెరికాకు వలస వచ్చారు.

దీంతో, ఈ పెళ్లిపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ముర్డోక్ ముసలోడేగానీ..మహానుభావుడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంత లేటు వయసులో ...ఎంత ఘాటు ప్రేమయో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాబోయే ఈ కపుల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.