Begin typing your search above and press return to search.

జగన్ కు బిగ్ రిలీఫ్... సుప్రీం నుంచి గుడ్ న్యూస్!

ఇదే సమయంలో... ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై

By:  Tupaki Desk   |   3 Nov 2023 9:32 AM GMT
జగన్ కు బిగ్ రిలీఫ్... సుప్రీం నుంచి గుడ్ న్యూస్!
X

జగన్ సీఎం అయినప్పటినుంచీ తీసుకున్న నిర్ణయాల విషయంలో, చేపడుతున్న పనుల విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పలుమార్లు కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే! ఈ విషయాలపై అప్పట్లో తీవ్ర చర్చ నడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడంపై కూడా కోర్టుల్లో పిటీషన్లు వేయడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో రుషికొండ నిర్మాణాల విషయంలో కూడా లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... రుషికొండపై నిర్మాణాలు అక్రమం అని, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంలో లింగమనేని శివరామ ప్రసాద్ రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే! దీనిపై చీఫ్‌ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో భాగంగా... విశాఖ రుషికొండ నిర్మాణాల విషయంలో స్పష్టత ఇచ్చింది. రుషికొండ నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని లింగమనేని వేసిన పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

ఇదే సమయంలో... ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ స్పష్టం చేసారు! అక్కడ సీఎం వెళ్లవద్దా.. క్యాంపు కార్యాలయాలు నిర్మించుకోవద్దా అంటూ వ్యాఖ్యానించడంతోపాటు... సుప్రీంకోర్టు అనేది రాజకీయాలకు వేదిక కాదు అని అంటూ చురకలు అంటించారని తెలుస్తుంది.

వాస్తవానికి మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటినుంచీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన అందించేందుకు సిద్దం అవుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. పలు కారణాలతోనో, కేసులతోనో వాయిదాలు పడుతూనే ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రుషికొండ పైన నిర్మాణాల విషయంలో రాజకీయంగా చర్చ జరుగుతుంది. అక్కడ కొండను ఆక్రమించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే ఈ వివిర్శలపై అధికారపార్టీ నుంచి భారీ కౌంటర్లే పడ్డాయి! ఇందులో భాగంగా... ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఆక్రమించటం ఏంటని వైసీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. ఇదే సమయంలో రుషికొండ నిర్మాణాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీజీ), హైకోర్టులలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమయంలో లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇందులో భాగంగా... గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టులలో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకూ ఋషికొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరిగింది. విచారణలో భాగంగా... అసలు ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉందని ప్రశించింది. అనంతరం ఈ పిటిషన్‌ ను కొట్టివేసింది.

మరోపక్క... అటు డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. దీంతో... మంత్రులు తమ కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవటానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది జగన్ కు ఈ సమయంలో పెద్ద గుడ్ న్యూస్ అని అంటున్నారు పరిశీలకులు.