Begin typing your search above and press return to search.

ఆ పుస్తకం ఖరీదు రూ.11 కోట్లు !

100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుస్తకాన్ని 1925లో అమెరికా రచయిత నెపోలియన్ హిల్ రాశారని సమాచారం.

By:  Tupaki Desk   |   6 Jun 2024 4:32 AM GMT
ఆ పుస్తకం ఖరీదు రూ.11 కోట్లు !
X

అవును మీరు చదివింది నిజమే. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో .. ఒక మంచి పుస్తకం కొనుక్కో' అన్న మన కందుకూరి వీరేశలింగం మాటలు వినిపించాయేమో ? ఓ పుస్తక ప్రియుడు ఏకంగా రూ.11 కోట్లు వెచ్చించి పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. ఆ పుస్తకం మీద ఎలాంటి దుమ్ము పడకూడదు అని భావించి ప్రైవేట్ విమానంలో దానిని ఇంటికి తీసుకుని వెళ్లాడు.

100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుస్తకాన్ని 1925లో అమెరికా రచయిత నెపోలియన్ హిల్ రాశారని సమాచారం. నెపోలియన్ ప్రత్యేకంగా సంతకం చేసిన ఈ పుస్తకం మొదటి ఎడిషన్‌ను అమెరికాలోని ఇడాహో నివాసి రస్సెల్ బ్రున్సన్ కొనుగోలు చేశారు. డైలీ స్టార్ కథనం ప్రకారం, ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి రస్సెల్ 11 కోట్లు చెల్లించాడు.

ఈ పుస్తకం వెల 1.5 మిలియన్ డాలర్లు అంటే 11 కోట్ల రూపాయలకు పైగానే నిర్ణయించారు కాబట్టి కొనడం దీనిని కొనడం అంత సులువు కాదు. దాదాపు నెల రోజుల పాటు అమ్మతో బేరసారాలు సాగించానని, నా భార్యను కూడా ఒప్పించాను. ఆ తర్వాత కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నానని రస్సెల్ వెల్లడించాడు. రస్సెల్ వృత్తిరీత్యా వ్యాపారవేత్త.