Begin typing your search above and press return to search.

2024లో భారత్ సహా 40 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయా?

ఇందులో డెవలప్ అయిన దేశాలు ఉన్నాయి. ఇప్పుడే వెలుగులోకి వస్తున్న దేశాలు కూడా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   21 Dec 2023 5:33 AM GMT
2024లో భారత్ సహా 40 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయా?
X

ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో అమెరికా, రష్యా, భారత్ నిలుస్తున్నాయి. 2024లో భారత్, రష్యా, అమెరికా, మెక్సికో, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అందరి ఫోకస్ ఈ దేశాలపైనే పడుతోంది. ప్రపంచాన్ని శాసించే దేశాలు కావడంతో ఇక్కడ ఎన్నికలు కీలకం కానున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే దేశాలు కావడంతో సహజంగా అందరికి ఆసక్తి కలుగుతోంది.

ఇందులో డెవలప్ అయిన దేశాలు ఉన్నాయి. ఇప్పుడే వెలుగులోకి వస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ దేశాల్లో జరిగే ఎన్నికలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయోననే సందేహాలు అందరిలో రావడం సహజమే. ఈనేపథ్యంలో అగ్రరాజ్యాలైన ఆర్థిక వ్యవస్థల పోకడ ఎలా ఉంటుందనే వాదనలు వస్తున్నాయి. ఈక్రమంలో ఇక్కడి ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

అమెరికాలో జోబైడెన్, ట్రంప్ రంగంలో ఉంటారని తెలుస్తోంది. మెక్సికో విషయానికి వస్తే ఇక్కడ ఇద్దరు పోటీదారులు మహిళలే కావడంతో ఎవరు గెలుస్తారో తెలియడం లేదు. దీంతో మెక్సికోలో మొట్టమొదటి సారి మహిళ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రష్యా పరిణామాలు పరిశీలిస్తే అక్కడ ఎక్కువ మంది వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వాన్నే సమర్థిస్తున్నారు. దీంతో అక్కడ ఆయన గెలుపు ఖాయమనే చెబుతున్నారు.

భారత్ లో సైతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీజేపీ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా మరోమారు గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు సమాచారం. ఇలా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఈ ఎన్నికలు ప్రభావం చూపుతాయనే అనుకుంటున్నారు.

2024లో భారత్ సహా 40 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నందున ఆ దేశాల్లో ఎలాంటి ప్రభావాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. మొత్తానికి వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరంగా భావించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే మార్చనున్నాయని చెబుతున్నారు.