Begin typing your search above and press return to search.

మోడీకి మాస్కో లో గ్రాండ్ వెల్ కం... హిందీ పాటలకు డ్యాన్స్!

ఇందులో భాగంగా... మాస్కోలో దిగినట్లు చెప్పిన ఆయన.. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   9 July 2024 3:53 AM GMT
మోడీకి మాస్కో లో గ్రాండ్  వెల్  కం...  హిందీ పాటలకు డ్యాన్స్!
X

మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ సుమారు ఐదేళ్ల తర్వాత రష్యాకు వెళ్లారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర తర్వాత ఆయన మాస్కోను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మాస్కోలో మోడీకి రష్యా నుంచి ఘనస్వాగతం లభించింది.

అవును... భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన 22వ భారత్ - రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారత ప్రధానికి మాస్కోలో ఘన స్వాగతం లభించింది. ఇందులో భాగంగా... మోడీ రాక సందర్భంగా రష్యన్ యువతులు హిందీ పాటలకు డ్యాన్సులు చేశారు.

ఇక, మాస్కోలో ల్యాండ్ అయిన తర్వాత మోడీ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మాస్కోలో దిగినట్లు చెప్పిన ఆయన.. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా భవిష్యత్ సహకార రంగాలలలో ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.

ఈ పర్యటనలో భాగంగా మొడీ.. రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక, నరేంద్ర మోడీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ పర్యటన అనంతరం మోడీ ఆస్ట్రియా వెళ్లనున్నారు.

కాగా... భారత్ కు రష్యా అత్యంత ఆత్మీయ దేశం అనే సంగతి తెలిసిందే. అగ్రరాజ్యమైన అమెరికాతో వారికున్న సంబంధం సంగతి పక్కనపెడితే... రష్యాతో మాత్రం హెల్దీ రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో పాటు పలు దేశాలు రష్యా – భారత్ బంధాన్ని డిస్ట్రబ్ చేయాలని కుట్రలు పన్నైనా.. ఇటు భారత్ కానీ, అటు రష్యా కానీ ఎప్పుడూ ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదని అంటారు.