మూడో ప్రపంచ యుద్ధం జస్ట్ మిస్... స్పష్టమైన కారణం ఇదే!
వివరాళ్లోకి వెళ్తే... గత రెండేళ్లుగా రష్యాతో అవిరామంగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధ క్షేత్రాల్లోని సైనికులను ఉత్సాహపరిచేందుకు పర్యటనలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 7 March 2024 6:18 AM GMTతాజాగా ఒడెస్సాలో ఒక దేశ ప్రధాని, మరో దేశ అధ్యక్షుడు లక్ష్యంగా ఒక క్షిపణి దాడి జరిగింది. అది విజయవంతం అయ్యి ఉంటే మాత్రం అదే... మూడో ప్రపంచ యుద్ధానికి మరో కీలక ముందడుకు అయ్యి ఉండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య ఈ విషయం అత్యంత చర్చనీయాంశం అయ్యింది. ఈ క్షిపణి దాడి చేసింది రష్యా కాగా... ఈ దాడి నుంచి తప్పించుకున్నది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్!
అవును... ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం అవిరామంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరుగుతున్నట్లు తెలుస్తున్న ఈ యుద్ధంలో ఒక కీలక ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... రష్యా ప్రయోగించిన క్షిపణి దాడిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్ లు తృటిలో తప్పించుకొన్నట్లు తెలుస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... గత రెండేళ్లుగా రష్యాతో అవిరామంగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధ క్షేత్రాల్లోని సైనికులను ఉత్సాహపరిచేందుకు పర్యటనలు చేస్తున్నారు. ఈ సమయంలో తనతోపాటు పలువురు ప్రపంచ నాయకులను కూడా తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే గ్రీక్ ప్రధానిని తీసుకుని బయలుదేరారు. అయితే... నాటో సభ్యదేశమైన గ్రీక్ ప్రధాని ఉండగానే వీరి కాన్వాయ్ పై రష్యా క్షిపణి దాడి జరగింది. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
ఈ సమయంలో వీరిద్దరూ ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి కేవలం 500 మీటర్ల దూరంలో రష్యా ప్రయోగించినట్లు చెబుతున్న క్షిపణి పడింది. ఆ సమయంలో ఆ దాడి జరిగిన ప్రదేశంలో పుట్టగొడుగు ఆకారంలో దట్టమైన భారీ పొగ ఎగసిపడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారట. దీంతో... ఈ దాడిలో గ్రీక్ ప్రధానికి ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే ఈ యుద్ధం ఊహకందనంత తీవ్రమయ్యేదని అంటున్నారు పరిశీలకులు.
ఇక ఈ దాడి అనంతరం స్పందించిన జెలెన్ స్కీ... తాను దాడిని చూసినట్లు తెలిపారు.. ఫలితంగా తాము ఎలాంటి వారితో యుద్ధం చేస్తున్నామనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు. ఈ సమయంలో అవసరమైన ఆత్మరక్షణ చర్యలకు గగన తల రక్షణ వ్యవస్థ అవసరం అని తెలిపారు. ఇదే క్రమంలో యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని గ్రీకు ప్రధానికి వివరించారు జెలెన్ స్కీ!
మరోపక్క ఈ వ్యవహారంపై రష్యా స్పందించింది. ఇందులో భాగంగా... ఈ దాడిని ధృవీకరించింది. అయితే నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సాలోని ఓ హ్యాంగర్ ను లక్ష్యంగా చేసుకుని దాడిచేసినట్లు వెల్లడించింది! ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు సముద్ర డ్రోన్లను సిద్ధం చేస్తున్నాయని తెలియడమే ఇందుకు కారణం అని చెబుతూ... ఈ దాడి విజయవంతం అయినట్లు పేర్కొంది.
కాగా... "నాటో" (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) అనేది 4 ఏప్రిల్ 1949లో ఏర్పడిన ఉత్తర అట్లాంటిక్ కూటమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, గ్రీక్ సహా 12 దేశాలు ఏర్పాటు చేసుకున్న సైనిక కూటమి. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్ లో ఉంది. వీరి ఒప్పందం ప్రకారం... నాటోలోని సభ్యదేశాలుగా ఉన్న ఏ దేశంపై అయినా, ఏ కారణం చేతనైనా బయట దేశాలు దాడి జరిపినట్లయితే.. ఆ దేశానికి నాటోలోని మిగిలిన దేశాలన్నీ సహాయం చేయాలి.
ఈ సమయంలో నాటో సభ్యదేశమైన గ్రీక్ దేశ ప్రధానిపై ఉక్రెయిన్ లో రష్యా క్షిపణి జరిపినట్లు చెబుతున్న దాడి విజయవంత అయ్యి.. ఆ ప్రధానికి ప్రమాదం జరిగి ఉంటే... అప్పుడు రష్యాపై నాటోదేశాలన్నీ యుద్ధం ప్రకటించేవి! దీంతో... మూడో ప్రపంచ యుద్ధం మొదలై ఉండెదనడంలో సందేహం లేదనే చెప్పాలి!!