ఖైదీల అవయవాలతో రష్యా వ్యాపారం!.... ఉక్రెయిన్ సైనికుడి భార్య సంచలన ఆరోపణ!
గత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అంశాల్లో రష్యా – ఉక్రెయిన్ వార్ ఒకటనేది తెలిసిన విషయమే.
By: Tupaki Desk | 26 July 2024 6:02 AM GMTగత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అంశాల్లో రష్యా – ఉక్రెయిన్ వార్ ఒకటనేది తెలిసిన విషయమే. ఈ విషయంలో మద్దతు కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కాళ్లకు బలంపం పట్టుకుని ప్రపంచదేశాల మద్దతుకోసం తిరుగుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత దారుణమైన, పాశవికమైన వ్యవహారం ఒకటి తెరపైకి వచ్చింది. ఉక్రెయిన్ సైనికుడి భార్య ఈ విషయాలు వెల్లడించింది.
అవును... చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల విషయంలో రష్యా అనుసరిస్తున్న వైఖరి పైశాచికంగా ఉందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... చనిపోయిన సైనికుల అవయువాలను రష్యా దొంగిలించి విక్రయిస్తోందని ఉక్రెయిన్ యుద్ధ ఖైదీ భార్య ఆరోపించింది. ఇప్పుడు ఈమె చేసిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇదే సమయంలో... ఉక్రేయినియన్ సైనికుల అనేక మృతదేహాలు కీలక అవయువాలు లేకుండా కనిపించాయని ఫ్రీడం టు డిఫెండర్స్ ఆఫ్ మారియుపోల్ గ్రూప్ అధిపతి లారీసా సలేవా వెల్లడించారు. ఇప్పటివరకూ సుమారు 10,000 మందికి పైగా ఉక్రేయినియలు రష్యా సైనికుల అదుపులో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీరంతా మృతదేహాలుగా మారితే మాత్రం.. వారి శరీరాల్లో కీలక అవయువాలు ఉండవని ఉక్రేనియన్లు ఆరోపిస్తున్నారు!
ఈ సందర్భంగా ఉక్రెయిన్ టుడేతో మాట్లాడిన లారీసా సలేవా... రష్యా చెర నుంచి హింసించబడిన ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను మేము స్వీకరిస్తాము అని తెలుసు కానీ.. దురదృష్టవసాత్తు అవయువాలు లేని శరీరాలను అందుకుంటామని మాత్రం ఊహించలేదని వాపోయారు. టర్కీలోని ఉక్రేనియన్ రాయబారి, అంకారాలోని యుద్ధ ఖైదీల కుటుంబాల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశాంలోనూ సలేవా ఈ వాదనలు చేశారు.
మరోవైపు ఈ వాదనను రష్యా ఖండించింది. రష్యన్ దళాలను దెయ్యాలుగా చూపించడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.