రష్యా - యుక్రెయిన్ వార్... ఇప్పటివరకూ ఎంతమంది చనిపోయారో తెలుసా?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 540 రోజులు దాటేసిన సంగతి తెలిసిందే. హోరా హోరీగా సాగుతున్న ఈ యుద్ధంపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది.
By: Tupaki Desk | 19 Aug 2023 6:09 AM GMTరష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 540 రోజులు దాటేసిన సంగతి తెలిసిందే. హోరా హోరీగా సాగుతున్న ఈ యుద్ధంపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. ఇంకా ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగబోతుందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో ఇలా నిరంతరాయంగా అన్నట్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకూ ఎంతమంది సైన్యం చనిపోయారనే విషయాలు యూఎస్ వెల్లడించిది.
అవును... రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచీ భారీగా మరణాలు సంభవిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. రష్యాకు చెందిన 1.20 లక్షల మంది సైనికులు మరణించగా.. 1.70 లక్షల మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఇది తమ అంచానా అనే కాదు.. కన్ ఫాం అనే మాటలు చెబుతుండటం గమనార్హం.
ఇదే సమయంలో... ఉక్రెయిన్ కు చెందిన 70వేల మంది సైనికులు మరణించగా, 1.10 లక్షల మంది గాయాలపాలయ్యారని వెల్లడించారు. అంటే... అమెరికా చెబుతోన్న లెక్కల ప్రకారం ఉక్రెయిన్ కంటే రష్యా సైనికులే ఎక్కువగా మృతి చెందారని తెలుస్తోంది. ఇదే సమయంలో గాయపడిన వారిలో కూడా రష్యా సైనికులే ఎక్కువ!
ఇక 18 నెలలుగా కొనసాగుతోన్న ఈ యుద్ధంలో... ఉక్రెయిన్ కు 5 లక్షల మంది సైనికులు ఉండగా, రష్యాకు 13.30 లక్షల మంది సైనికులు ఉన్నారని అంటున్నారు. వీరిలో కనీసం 8.3 లక్షల మంది పాల్గొన్నారు.
కాగా... ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా చైనా వద్ద ప్రస్తుతం 20 లక్షల మంది సైనికులు ఉన్నారు. అనంతరం భారత్ లో 14.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థికాభివృద్ధి సాధించినా అక్కడ సైన్యం తక్కువగానే ఉంది. ఈ దేశంలో ప్రస్తుతం 13.9 లక్షల మంది సైనికులు ఉన్నట్లు సమాచారం.