Begin typing your search above and press return to search.

"సీసీటీవీలో వ్యక్తి నా కొడుకులా లేడు"... సైఫ్ కేసులో నిందితుడి తండ్రి షాక్!

సైఫ్ పై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజ్ లో చూపించిన నిందితుడు తన కుమారుడిలా లేడని అతడి తండ్రి స్పందించినట్లు కథనాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 Jan 2025 4:45 AM GMT
సీసీటీవీలో వ్యక్తి నా కొడుకులా లేడు... సైఫ్ కేసులో నిందితుడి తండ్రి షాక్!
X

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఇటీవల ఆయన నివాసంలో జరిగిన దాడిలో నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. కోర్టు అతడిని ఐదు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఈ సమయంలో నిందితుడిని పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేస్తున్నారని అంటున్నారు.

ఈ సమయంలో.. పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. దాడికి ఉపయోగించిన కత్తిలోని ఓ ముక్క మిస్ అయితే, దాన్ని సమీపంలోని చెరువు వద్ద ఉన్నట్లు చూపించాడని.. దాడి సమయంలోనూ, ఆ తర్వాత అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు!

ఇలా ఈ కేసులో విచారణ ముందుకు వెళ్తుందని.. దొరికిన వ్యక్తి అసలు నిందితుడే అని.. ఇక పోలీసులు పక్కాగా విచారణ చేసి ఇక కోర్టులో సమర్పించడమే తరువాయని అంటున్న నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. సైఫ్ పై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజ్ లో చూపించిన నిందితుడు తన కుమారుడిలా లేడని అతడి తండ్రి స్పందించినట్లు కథనాలొస్తున్నాయి.

అవును.. సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ లోని నిందితుడు తన కొడుకులా అనిపించడం లేదని.. అతడిని తప్పుగా ఈ కేసులో ఇరికించారని.. సీసీటీవీ ఫుటేజ్ లో పొడవాటి జుట్టుతో చూపిస్తున్న అనుమానితూడి రూపానికి తన కొడుకు రూపానికి సరిపోలడం లేదని తాజాగా చెప్పుకొచ్చారని అంటున్నారు.

ఇదే సమయంలో... తన కుమారుడు తన జుట్టును ఎప్పుడూ పొడవుగా ఉంచుకోడని, ఈ కేసులో తన కొడుకు ఫ్రేమ్ చేయబడి ఉన్నాడని తాను నమ్ముతున్నానని.. అసలు ఫుటేజ్ లో ఉన్న వ్యక్తికి తన కుమారుడికి ఎలాంటీ సంబంధం లేదని.. స్పష్టంగా చూస్తే ఎవరికైనా అర్ధమవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఇక తన స్వదేశం బంగ్లాదేశ్ లో అశాంతి కారణంగా తన కుమారుడు షరీఫుల్ భారత్ కు వెళ్లారని.. అతడు హోటల్ ఫీల్డ్ లో మంచి ఉద్యోగ అవకాశాల కోసమే ముంబై వెళ్లాడని చెప్పుకొచ్చారని.. ఇదే సమయంలో తన కుమారుడిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్న విషయంలో తనకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదని అతడు నొక్కి చెప్పాడని అంటున్నారు.

దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ ఆరోపణలపై ముంబై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.