తనపై దాడి కేసులో సైఫ్ వాంగ్మూలం.. తెరపైకి సంచలన విషయాలు!
తనపై జరిగిన దాడి కేసులో తాజాగా సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
By: Tupaki Desk | 24 Jan 2025 7:10 AM GMTబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై బంద్రాలోని ఆయన నివాసంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం కోలుకుంటున్నారని అంటున్నారు. మరోపక్క.. నిందితుడితో పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేయించారని చెబుతున్న వేళ.. సైఫ్ అలీఖాన్ దాడి జరిగిన వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు వాంగ్ములం ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక విషయాలు తెరపైకి వచ్చాయి!
అవును... తనపై జరిగిన దాడి కేసులో తాజాగా సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో భాగంగా.. తాను కరీనా కపూర్ గదిలో ఉన్నప్పుడు చిన్న కుమారుడు జెహ్ కేర్ టేకర్ యలియామా ఫిలిప్ కేకలు వినిపించాయని.. దీంతో బయటకు వచ్చినట్లు సైఫ్ తెలిపారు. ఈ సమయంలో గదిలో జెఫ్ ఏడుస్తున్నాడని తెలిపారు.
మరోపక్క.. తాను దుండగుడిని చూసి పట్టుకోడానికి ప్రయత్నించినట్లు చెప్పారని అంటున్నారు. ఆ ప్రయత్నంలో... అతడు తన వీపు, మెడ, చేతులపై కత్తితో దాడి చేశాడని.. ఈ సమయంలో అతడిని గదిలో బంధించాలని తీవ్రంగా ప్రయత్నించానని సైఫ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక.. ఈ ఘటన 16వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే... సైఫ్ అలీఖాన్ బాంద్రా ఫ్లాట్ నుంచి సేకరించిన వేలిముద్రలు, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి వేలిముద్రలతో సరిపోలినట్లు నిర్ధారించబడిందని అంటున్నారు. నిందితుడు భవనంలోని 11వ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయొగించిన ఏసీ డక్ట్ పైపుపైనా పింగర్ ప్రింట్స్ కనుగొనబడ్డాయని.. అవి కూడా సరిపోలాయని అంటున్నారు.
అయితే.. సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలో సంబంధించిన వ్యక్తి తన కొడుకును పోలి లేడదని.. షరీఫుల్ తండ్రి చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా... దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అతడు బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (30)గా పోలీసులు గుర్తించారు. ఇతడు ఏడు నెలల క్రితమే బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి వయా మేఘాలయాలోకి డౌకీ నది దాటి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించగా.. భారత్ లో బిజయ్ దాస్ గా పేరు మార్చుకున్నట్లు తెలిపారు!