Begin typing your search above and press return to search.

యూఎస్ ప్రెసిడెంట్ ని చంపాలనుకున్నా... నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్‌!

అవును... 2023 లో వైట్ హౌస్ వద్ద ఓ యువకుడు ట్రక్కుతో చేసిన దాడి ఘటనకు సంబంధించి నిందితుడు సాయి వర్షిత్ నేరాన్ని అంగీకరించాడు.

By:  Tupaki Desk   |   14 May 2024 1:30 PM GMT
యూఎస్  ప్రెసిడెంట్  ని చంపాలనుకున్నా... నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్‌!
X

గత ఏడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వద్ద ఓ యువకుడు ట్రక్కుతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన భారత సంతతి యువకుడు 20 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కుర్రాడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు.

అవును... 2023 లో వైట్ హౌస్ వద్ద ఓ యువకుడు ట్రక్కుతో చేసిన దాడి ఘటనకు సంబంధించి నిందితుడు సాయి వర్షిత్ నేరాన్ని అంగీకరించాడు. ఇందులో భాగంగా... జో బైడెన్‌ ప్రభుత్వాన్ని దించి, నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడినట్లు చెప్పాడని అటార్నీ తెలిపింది. ఈ నేపథ్యంలో... అతడికి ఆగస్టు 23న శిక్ష ఖరారు చేయనున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ట్‌ కోర్టు వెల్లడించింది.

కాగా... గత ఏడాది మే 22న ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అద్దె ట్రక్కు తీసుకుని వైట్‌ హౌస్‌ వద్దకు వెళ్లిన సాయి వర్షిత్‌ .. అక్కడ బీభత్సం సృష్టించాడు. ఈ క్రమంలో... శ్వేతసౌధంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే తన లక్ష్యమని విచారణలో నిందితుడు అంగీకరించాడని చెబుతున్నారు.

ఈ క్రమంలో తన లక్ష్యం నెరవేరడం కోసం అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్‌, ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్లు వెల్లడించాడు.

వాస్తవానికి... మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నుంచి వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్న సాయి వర్షిత్‌... అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి 9:35 గంటల ప్రాంతంలో వైట్‌ హౌస్‌ వద్దకు వెళ్లి సైడ్‌ వాక్‌ పై వాహనాన్ని నడిపాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు.

అనంతరం ఆ వైట్ హౌస్ నార్త్ వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ ను ఢీకొట్టాడు. ట్రక్కును రివర్స్‌ చేసి మరోసారి ఢీకొట్టాడు. ఇదే క్రమంలో... వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

కాగా... మిస్సోరిలోని ఛెస్ట్‌ ఫీల్డ్‌ కు చెందిన సాయి వర్షిత్‌ ది అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి కుటుంబం. ఇతడు 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఇదే క్రమంలో... ప్రోగ్రామింగ్‌, కోడింగ్ లాంగ్వేజీలపై పట్టున్న అతడు.. డేటా అనలిస్ట్‌ గా కెరీర్‌ ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.