Begin typing your search above and press return to search.

స‌జ్జ‌ల‌.. సాక్షికే.. సంచ‌ల‌న మార్పు దిశ‌గా జ‌గ‌న్‌... !

గతంలో కూడా సాక్ష్యం మీడియాలో డైరెక్టర్ గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పత్రికను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు.

By:  Tupaki Desk   |   12 Sep 2024 3:30 AM GMT
స‌జ్జ‌ల‌.. సాక్షికే.. సంచ‌ల‌న మార్పు దిశ‌గా జ‌గ‌న్‌... !
X

వైసీపీలో కీలక నాయకుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది నాయకులు... పార్టీ ఓడిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరికొందరు సలహాదారుల వైపు వేళ్లు చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే తమ టికెట్ కోల్పోయామని అదేవిధంగా తమపై లేనిపోని ప్రచారాలు చేశారని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్కు అనేకమంది ఫిర్యాదులు చేశారు.

సాధారణంగా సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆది నుంచి కూడా వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. అన్నింటికీ ఆయనే జోక్యం చేసుకోవడం, ప్రతి విషయంలోనూ ఆయనే స్పందించడం మంత్రులు సహా ఎమ్మెల్యేలను కూడా డమ్మీ చేశారన్న వాదన కూడా వినిపించింది. దీంతో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి లేకుండా మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇక ఎన్నికల సమయంలో కూడా ఆయన జోక్యం పెరిగిపోవడం ఆయన వల్ల ఒకళ్ళిద్దరు తీవ్రంగా బాధపడి పార్టీ నుంచి కూడా దూరం కావడం తెలిసిందే. ఇక అనేకమంది టికెట్లు కూడా కోల్పోయారు.

ఈ పరిణామాలు పార్టీలో అంతర్గతంగా చర్చకు వస్తున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్కు మధ్య ఉన్న అనుబంధం కారణంగా ఆయన పార్టీలో చలామణి అవుతున్నారు. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సజ్జల రామకృష్ణారెడ్డిని కొనసాగిస్తే ఇబ్బందులు తప్పవని నాయకులు ఎవరూ కూడా ముందుకు రారని అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డిని సాధ్యమైనంత వేగంగా పార్టీ బాధ్యతలనుంచి తప్పించి తిరిగి సాక్షి మీడియాకు పంపిస్తారని అత్యంత విశ్వ‌స‌నీయ‌ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో కూడా సాక్ష్యం మీడియాలో డైరెక్టర్ గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పత్రికను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా అదే పాత్రకు ఆయనను పరిమితం చేస్తారని తెలుస్తోంది. అయితే.. దీనికి కొంత స‌మ‌యం ప‌ట్ట వ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రో వైపు పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. స‌జ్జ‌ల ప్రాధాన్యం త‌గ్గిపోయింద‌ని అనుకున్నా.. ఇటీవ‌ల నియ‌మించిన కొంద‌రి విష‌యంలో ఆయ‌న చెప్పిన వారికే జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప‌రిణామాల‌తో స‌జ్జ‌లను త‌ప్పించ‌డం సాధ్యం కాద‌న్న వాద‌న కూడా వినిపించింది. అయితే.. రాను రాను పార్టీ మ‌రింత ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో స‌జ్జ‌ల మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు.