Begin typing your search above and press return to search.

భార్గవ్ పై (ఫేక్) ప్రచారం... క్లారిటీ ఇచ్చిన నాగార్జున యాదవ్!

అవును... ఇటీవల కాలంలో ఫేక్ న్యూస్ లు ప్రధాన మీడియాలోనూ ఎక్కువైపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   20 Jun 2024 6:55 AM GMT
భార్గవ్ పై (ఫేక్) ప్రచారం... క్లారిటీ ఇచ్చిన నాగార్జున  యాదవ్!
X

ఈ రోజుల్లో ప్రధాన పత్రికల్లోనూ, మెయిన్ స్ట్రీం మీడియాల్లోనూ వచ్చినా కూడా ఏది నిజమో, ఏది ఫేక్ న్యూసో గుర్తించడం సగటు పాఠకుడికి, వీక్షకుడికి అతిపెద్ద సమస్యగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎవరో గాసిప్స్ క్రియేట్ చేసినట్లుగా ప్రధాన మీడియాల్లోనూ పలు ఫేక్ వార్తలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఇందులో భాగంగా.. సజ్జల భార్గవ్ కి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది.

అవును... ఇటీవల కాలంలో ఫేక్ న్యూస్ లు ప్రధాన మీడియాలోనూ ఎక్కువైపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలకు ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవ్ దూరంగా ఉంటున్నారని.. ఆయన తండ్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రోజూ జగన్ వద్దకు వస్తున్నప్పటికీ... భార్గవ్ మాత్రం దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు, ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

అక్కడితో ఆగని ఆ వార్త... దీంతో సజ్జల భార్గవ్ బాధ్యతను నాగార్జున యాదవ్‌ కు జగన్‌ అప్పగించారని అంటున్నారు అంటూ కొనసాగింది. దీంతో... ఈ విషయంపై స్వయంగా నాగార్జున యాదవ్ స్పందించారు. వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా సజ్జల భార్గవ్ ను తప్పిస్తున్నారన్న వార్త పూర్తిగా అవాస్తవమని.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు.

ఇందులో భాగంగా... "బలమైన ప్రజాపక్షంగా, నిర్మాణాత్మక మన సోషల్ విభాగ సైన్యం వైఎస్ జగన్ మార్గదర్శకత్వంలో, సజ్జల భార్గవ్ ఆధ్వరంలో ప్రభావశీల పంథాలో సాగుతుంది. నాకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బాధ్యతలు ఇచ్చారంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవం" అని ట్వీట్ చేశారు. దీంతో.. భార్గవ్ ని తప్పించారంటూ వచ్చింది “ఫేక్” న్యూస్ అని క్లారిటీకి వస్తున్నారు పార్టీ శ్రేణులు!