సీబీఎన్ వైరస్ తో ఈసీ ఇన్ఫెక్ట్... సజ్జల సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. గెలుపు మాదంటే మాదని జూన్ నాలుగో తేదీ తర్వాత సంబరాలకు ప్లాన్స్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 28 May 2024 11:47 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం, మహిళలు - వృద్ధులూ పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనడంతో.. ఇది ఎవరికి అనుకూలానికి సంకేతం అనే విషయాలపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. గెలుపు మాదంటే మాదని జూన్ నాలుగో తేదీ తర్వాత సంబరాలకు ప్లాన్స్ చేస్తున్నారు. మరోపక్క జూన్ 9న విశాఖలో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
ఇందులో భాగంగా... ఉద్యోగులంతా తమ వెనుకే ఉన్నారని పోస్టల్ బ్యాలెట్ కు లేనిపోని నిబంధనలు అంటగడుతున్నారని మండిపడిన సజ్జల... పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ప్రధానంగా బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత కూటమికి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని సజ్జల ఆరోపించారు.
ఇదే సమయంలో ప్రధానంగా... మాచర్ల ఘటనల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదని.. ఈవీఎం ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదని ఫైర్ అయిన ఆయన... మిగిలిన చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.
ఇదే క్రమంలో... తమకు అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగామని చెప్పిన ఆయన.. టీడీపీ ఎందుకు రీ పోలింగ్ అడగలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో... తమ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఎన్ అనే వైరస్ తో ఈసీ ఇన్ఫెక్ట్ అయిందని సెటైర్లు పేల్చారు.