టోటల్ 175కి అభ్యర్ధులు ఉన్నారా... బాబుకి సజ్జల స్ట్రైట్ క్వశ్చన్
తెలంగాణాలో ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడాన్ని ఆయ్నా తప్పు పడుతూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు
By: Tupaki Desk | 27 Nov 2023 4:29 PM GMTఏపీలో ఉన్నవే 175 సీట్లు. వీటి మొత్తానికి అభ్యర్ధులు మీకు ఉన్నారా చంద్రబాబూ అంటూ వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి చంద్రబాబుకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ వేశారు. టీడీపీకి ఒక విధానం అంటూ ఉందా అని నిగ్గదీశారు. ఏపీలో ఒకలా తెలంగాణాలో మరోలా అసలు ఏంటి మీ రాజకీయం అని ఆయన ఫైర్ అయ్యారు.
తెలంగాణాలో ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడాన్ని ఆయ్నా తప్పు పడుతూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
టీడీపీ అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం మీద టన్నుల కొద్దీ విషం చిమ్మిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో ఏ ఒక్క సంక్షేమ పధకం ఆగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాదు అర్హత ప్రమాణంగా చేసుకుని టీడీపీ జనసేన క్యాడర్ కి కూడా ప్రభుత్వ పధకాలు ఇస్తూంటే తప్పుడు ప్రచారంతో తప్పుడు రాతలతో వైసీపీని బదనాం చేయాలని చూస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు.
చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు ఎక్కడ పధకం ఆపేశారో చూపించాలని ఆయన సవాల్ చేశారు పవన్ కళ్యాణ్ పార్టీ వారు అయినా అర్హత ఉంటే ఏ పధకం ఇవ్వలేదో చెప్పాలని కూడా ఆయన అన్నారు. ఇసుక కుంభకోణం అని లేని పోని విమర్శలు చేస్తున్నారని, నిజానికి చంద్రబాబు హయాంలోనే ఉచిత ఇసుక పేరుతో స్కాములు చేశారని ఆయన ఎత్తి చూపారు.
ఉచిత ఇసుక నాడు ఇచ్చామని చెబుతున్న టీడీపీ పెద్దలు ఆనాడు హరిత ట్రిబ్యునల్ ఎందుకు వంద కోట్ల జరీమానా విధించిందో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని విపక్షాలే విషం కక్కుతున్నాయని సజ్జల అన్నారు.
సామాజిక సాధికార బస్సు యాత్ర బ్రహ్మాండంగా సాగుతూంటే సభ పూర్తి అయిన తరువాత ఖాళీ కుర్చీలను చూపించి జనాలు రాలేదని చెప్పడం అలా రాతలు అనుకూల మీడియాలో రాయించడం టీడీపీకే చెల్లింది అని ఆయన అన్నారు ఇప్పటిదాకా రాష్టంలో ముప్పయి లక్షల ఇళ్ళను గృహ సారధులు సందర్శించారని సజ్జల చెప్పారు.
ఇక లోకేష్ మీటింగులో పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయితే ఢిల్లీలో కూర్చుని లోకేష్ ఏమి చేశాడో చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. లోకేష్ జనాల దృష్టిలో ఎప్పటికీ జోకర్ మాత్రమే అని ఆయన అన్నారు. ఆయన వచ్చాడంటే జోకర్ అని జనాలు సంతోషపడతారు తప్ప ఎవరూ సీరియస్ గా తీసుకోరని, లోకేష్ బూతులు మాట్లాడడం తప్ప చేసేది కూడా ఏమీ లేదని సజ్జల విమర్శించారు.