Begin typing your search above and press return to search.

సజ్జల సీటు వెనక్కి ?

ఆ విధంగా చూస్తే సజ్జల ప్రాముఖ్యత తగ్గిందా లేక ఆయన కావాలని వెళ్ళి అక్కడ కూర్చున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. అదే సమయంలో సజ్జల వెనక్కి వెనక్కి పోవడం పట్ల సర్వత్రా కొత్త డిస్కషన్ మొదలైంది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 1:19 PM GMT
సజ్జల సీటు వెనక్కి ?
X

వైసీపీకి జగన్ కి ఆత్మ లా పేరు గడించిన వారు సచివుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి. పార్టీలో ప్రభుత్వం లో ఏదైనా విషయం మీద మాట్లాడాలీ అంటే సజ్జల పనిగట్టుకుని మీడియా ముందుకు వచ్చేవారు. ఆయనకు అందుకే సకల శాఖల మంత్రి అని పేరు కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టేశారు.

ఎంత పెద్ద ఇష్యూ అయినా ఎంతటి తీవ్రమైన సమస్య అయినా సజ్జల మాత్రమే మాట్లాడేవారు. దాంతో చాలా మందిని పార్టీ అన్నా ప్రభుత్వం అన్నా సజ్జల మాత్రమేనా అన్న డౌట్లు వచ్చేవి. ఇక సీఎం జగనా లేక సజ్జలా అని ఒకానొక దశలో చాలా మంది విమర్శించే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ వర్గాలతో సరైన చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించే విషయంలోనూ సజ్జల వ్యవహార శైలి మూలంగానే బెడిసి కొట్టింది అన్న ఆరోపణలు ప్రచారాలూ ఉన్నాయి.

ఏది ఏమైనా జగన్ కి నీడలా సజ్జల వ్యవహరించేవారు. సజ్జల పక్కన లేకపోతే జగన్ కనిపించేవారు కాదు అన్న మాట కూడా అయిదేళ్ళుగా ప్రచారంలో ఉంది. అలాంటి సజ్జల మీద పార్టీ ఓటమి తరువాత వెల్లువలా విమర్శలు వచ్చాయి. ఆయన వల్లనే ఇదంతా అని పార్టీ నేతలు రుసరుసలు ఆడిన నేపధ్యాలు ఉన్నాయి.

అలాగే జగన్ కి పార్టీకి మధ్య సజ్జల ఉంటూ అతి పెద్ద గ్యాప్ ని సృష్టించారు అని కూడా అంటూ వచ్చారు. మరి ఇవన్నీ విన్న ప్రభావంలో లేక ఈ ప్రచారాలలో ఎంతో కొంత వాస్తవం ఉంది అన్న భావనో తెలియదు కానీ ఒక్కసారిగా సజ్జల సీటు కదిలిపోయింది. జగన్ పక్కన వేదిక మీద ఉండాల్సిన సజ్జల సీటు కాస్తా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చూస్తే ఏకంగా అయిదవ బెంచ్ లోకి వెళ్ళిపోయింది.

ఆ విధంగా చూస్తే సజ్జల ప్రాముఖ్యత తగ్గిందా లేక ఆయన కావాలని వెళ్ళి అక్కడ కూర్చున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. అదే సమయంలో సజ్జల వెనక్కి వెనక్కి పోవడం పట్ల సర్వత్రా కొత్త డిస్కషన్ మొదలైంది. పార్టీ క్యాడర్ ని లీడర్ ని చేరదీయాలంటే మధ్యన ఎవరూ ఉండరాదు అన్న పార్టీవాదుల మాటను మన్నించి ఆయన్ని అలా వెనక్కి పంపించారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఏది ఏమైనా సజ్జల మీడియాలో కనిపించి చాలా రోజులు అయింది. అంతే కాదు ఇపుడు పార్టీలో ఆయన ప్లేస్ వెనక్కి వెళ్ళింది. మరి ఆయన ప్లేస్ ఇంకా వెనక్కి తెర వెనక్కి పోతుందా లేక ముందుకు వచ్చేది ఉంటుందా అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా సజ్జల సీటు తోనే మార్పు అన్నది చాలా మంది గుసగుసలు పోతున్న పరిస్థితి ఉంది. చూడాలి మరి ఈ మార్పు ఎంత కాలం ఉంటుందో అని అంటున్నారు.