సజ్జనార్ పైనే ఆరోపణలా? నిజమెంత?
తెలంగాణలో మంగళవారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది, ఇది రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది.
By: Tupaki Desk | 12 March 2025 9:15 AM ISTతెలంగాణలో మంగళవారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది, ఇది రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్‌పై కొందరు ఆర్టీసీ ఉద్యోగులు అవినీతి ఆరోపణలు చేశారు. వినూత్న నిరసనకు దిగిన ఈ ఉద్యోగులు, ఆయన అవినీతికి సంబంధించి 9 పేజీల లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపారు.
సజ్జన్నార్ అంటేనే నిఖార్సైన పోలీస్ అధికారి, నేరస్తులకు అతడు సింహస్వప్నంగా మారిన వ్యక్తి. వరంగల్ యాసిడ్ దాడి కేసు, దిశ హత్య కేసుల వంటి అతి సంచలనాత్మక ఘటనల్లో నిందితులను తక్కువ సమయంలో పట్టుకున్నారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా ఆయన్ను తెలుగు ప్రజలు మరిచిపోలేరు. అలాంటి అధికారి మీద అవినీతి ఆరోపణలు రావడం రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ ఆరోపణలపై టీఎస్‌ఆర్టీసీ సంస్థ తక్షణమే స్పందించింది. సంస్థ నిబంధనలను ఉల్లంఘించిన డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులపై విచారణ జరిపిన సజ్జన్నార్, అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డ 400 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తమ ఉద్యోగాలు కోల్పోయినవారే ఇప్పుడు నిరసనకు దిగుతూ సజ్జన్నార్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని సంస్థ పేర్కొంది. అంతేకాదు, ఈ ఉద్యోగుల దుష్టచర్యలకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది.
ఏకంగా స్టిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీదనే ఆరోపణలు చేసిన ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.