Begin typing your search above and press return to search.

నాడు వద్దు... నేడు ముద్దు అంటున్న జగన్ ?

రాజకీయాల్లో కాదన్నది అవుననిలే అన్నది అందరికీ తెలిసిందే ముఖ్యంగా రాజకీయ నేతలు ఏది అయితే అంటారో అది రివర్స్ లో కూడా చేస్తారు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 3:16 AM GMT
నాడు వద్దు... నేడు ముద్దు అంటున్న జగన్  ?
X

రాజకీయాల్లో కాదన్నది అవుననిలే అన్నది అందరికీ తెలిసిందే ముఖ్యంగా రాజకీయ నేతలు ఏది అయితే అంటారో అది రివర్స్ లో కూడా చేస్తారు. అయితే ఈ టైం పాలిటిక్స్ కి జగన్ కాస్తా భిన్నం. ఆయన కాదు అనుకుంటే కాదు అనే అంటారు. అది ఎప్పటికైనా.

కానీ 2024 ఎన్నికల్లో ఘోరమైన ఫలితం వచ్చిన తరువాత జగన్ లో కాస్తా మార్పు వచ్చినట్లుంది అని అనుకుంటున్నారు. లేకపోతే ఒకనాడు వస్తామని పార్టీలో చేరుతామని అనుకున్న వారిని నాడు చేర్చుకోలేదు అని అంటారు.

ఇపుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాంతో వద్దు అన్నవారే ముద్దు అయ్యారని కూడా ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాధ్ వైసీపీలో చేరుతారు అని గాసిప్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఇటీవల కర్నూలులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్ తో అక్కడికి వచ్చిన శైలజానాధ్ కలసి మాట్లాడారు అని ప్రచారం సాగుతోంది. ఆయన సొంత నియోజకవర్గం సింగనమల నియోజకవర్గంలో బలమైన నాయకుడు. రెండు సార్లు అక్కడ నుంచి గెలిచి వచ్చారు. మంత్రిగా కూడా పనిచేశారు.

ఆయనను వైసీపీలోకి తీసుకుని రావాలని జగన్ అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. సాకె శైలజానాధ్ వస్తే కనుక పార్టీకి అక్కడ కొత్త బలం వస్తుందని ఆయన నాయకత్వంలో పార్టీ పుంజుకుంటుందని భావిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే శైలజానాధ్ వైసీపీలోకి కొత్త ఏడాది చేరుతారు అని అంటున్నారు

ఇదిలా ఉంటే సాకే శైలజనాధ్ 2019 ఎన్నికల తరువాత వైసీపీలో చేరాలని చూసారని చెబుతారు. అయితే ఆయనను ఆనాడు పార్టీలోకి తీసుకోవడానికి లెక్కలు సరిపోలేదని అంటారు. పైగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేయడంతో ఆయన వర్గంగా ముద్ర వేశారు అని కూడా అంటారు.

మొత్తానికి చూస్తే సాకె శైలజానాధ్ కి ఆనాడు వైసీపీలో చేరేందుకు చాన్స్ రాలేదని అంటారు. ఇపుడు పార్టీ దారుణంగా ఓటమి చెందాక ఆయనను తీసుకుంటున్నారు అని చెబుతారు. పార్టీలో అన్ని రకాలుగా పదవులు అనుభవించి బయటకు పోతున్న నేతలు ఎంతో మంది ఉన్నారు.

అటువంటి వేళ అధికారం కోసం ఆశించకుండా విపక్షంలో కష్టాలలో ఉన్న వైసీపీలో కనుక శైలజానాధ్ చేరాలని అనుకుంటే మాత్రం ఆయన రాజకీయానికి నిజాయతీకి మెచ్చి తీరాల్సిందే. ఇక కష్టంలో పార్టీ ఉన్నపుడు శైలజానాధ్ లాంటి వారు చేరితే కనుక వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీ మీద ఉంటుంది. ఏది ఏమైనా వైసీపీ అధినాయకత్వంలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఇదే అని అంటున్నారు.