వైసీపీలోకి సాకే రాక.. ముహూర్తమే లేట్..!
మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి ఒకప్పుడు వెన్నుదన్నుగా ఉన్న ఎస్సీ నాయకుడు.. సాకే శైలజానాథ్. ఈయన గురించి ఇంకా చాలానే ఉంది.
By: Tupaki Desk | 25 Dec 2024 6:26 AM GMTమాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి ఒకప్పుడు వెన్నుదన్నుగా ఉన్న ఎస్సీ నాయకుడు.. సాకే శైలజానాథ్. ఈయన గురించి ఇంకా చాలానే ఉంది. ఏపీ విభజన తర్వాత.. తొలి పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అయితే.. ఆయన ఆ పదవిని వదులుకున్న తర్వాత.. సాకేనే ఈ పగ్గాలు పట్టుకున్నారు. అయితే.. అప్పట్లో జగన్‌ను విమర్శించడం లేదని.. కొందరు పెద్దలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పాటు.. సాకే కూడా .. పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవడంతో ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకొన్నారు.
కానీ, పార్టీలోనే ఉన్నారు. అయితే.. వైఎస్ షర్మిలను విభేదించే అంతర్గత నాయకుల్లో సాకే ఒకరు. ఆది నుంచి కూడా.. వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా.. ఆయన కుటుంబానికి అభిమానిగా ఉన్న సాకే.. వృత్తి రీత్యా డాక్టర్. తర్వాత.. రాజకీయాల్లోకి వచ్చి శింగనమల నియోజకవర్గం నుంచి విజయందక్కించుకుని మంత్రిగా కూడా చేశారు. ఇక, విభజన తర్వాత.. ఆయన రాజకీయంగా యాక్టివ్ కాలేక పోయారు. మరోవైపు షర్మిల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత.. సాకే మరింత సైలెంట్ అయ్యారు.
ఈ పరిణామాల క్రమంలోనే సాకే.. త్వరలోనే వైసీపీలో చేరుతున్నారని.. గత ఆరేడు మాసాలుగా ప్రచారం జరిగింది. వాస్తవానికి ఎన్నికలకు ముందే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారన్నచర్చ కూడా ఉంది. కానీ, కారణాలు ఏవైనా ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఇక, ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. అయినప్పటికీ .. సాకే మాత్రం ఆ పార్టీలోకే చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కేవలం వార్తలే కాకుండా.. ఆయన తాజాగా జగన్‌తోనూ భేటీ అయ్యారు.
అంతేకాదు.. వైసీపీలో ఉన్న వారిలో చాలా మంది కాంగ్రెస్ నాయకులేనని చెప్పడం ద్వారా.. తన ఎంట్రీ విషయంపై.. సాకే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. 23 సీట్లే వచ్చిన టీడీపీ తిరిగి అధికారంలో కి వచ్చింది కదా! అనడం ద్వారా.. ఆయన వైసీపీని పరోక్షంగా ప్రోత్సహించారు. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. సాకే రాక ఖాయమైందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే.. ముహూర్తమేతరువాయి అని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం పార్టీకి బలైమన నాయకుల అవసరం ఉందని.. ఈ క్రమంలో చేరికలను ప్రోత్సహించడం ద్వారా.. జగన్ పార్టీపై దృష్టి పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.