Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా ఆపరేషన్... లారెన్స్ బిష్ణోయ్ కు భారీ షాకిచ్చిన పోలీస్!

వీటన్నింటికీ కారణమైన లారెన్స్ బిష్ణోయ్ కి తాజాగా షాక్ తగిలింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 11:29 AM GMT
పాన్  ఇండియా ఆపరేషన్... లారెన్స్  బిష్ణోయ్  కు భారీ షాకిచ్చిన పోలీస్!
X

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధీఖ్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఈ హత్య వ్యవహారంతో ముంబై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఇదే సమయంలో నగరం మళ్లీ అండర్ వరల్డ్ చేతుల్లోకి వెళ్తోందా అనే చర్చా మొదలైంది.

మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి భద్రత పెరిగింది.. ఆయనకు సంబంధించిన ఫోటోలు విడుదల చేయకూడదని కెమెరా మెన్స్ ఫిక్సయ్యారు.. ఆయన షూటింగ్ స్పాట్ లను రివీల్ చేయకూడదనే చర్చలు కూడా ఇండస్ట్రీలో జరుగుతున్నాయని చెబుతున్నారు. వీటన్నింటికీ కారణమైన లారెన్స్ బిష్ణోయ్ కి తాజాగా షాక్ తగిలింది.

అవును... లారెన్స్ బిష్ణోయ్ కి తాజాగా బిగ్ షాక్ తగిలిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. అతడి గ్యాంగ్ కు చెందిన ఏడుగురు షూటర్లను పంజాబ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో.. వారి నుంచి వివిధ రకాల ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

ఇందులో భాగంగా... అరెస్ట్ అయిన వారి దగర నుంచి ఆరు సెమీ ఆటోమెటిక్ పిస్టల్స్, 24 కాట్రిడ్జెస్ ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో... నిందితులు తాము టార్గెట్ చేసుకున్న వాహనాలను అనుసరించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని కూడా వినియోగిస్తున్నట్లు గుర్తించారని అంటున్నారు.

వీరి టార్గెట్ రాజస్థాన్ లోని మాజీ ఎమ్మెల్యే కొడుకు సునీల్ పహిల్వాన్ అని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... వీరి దగ్గర నుంచి బాబా సిద్ధీఖ్ హతకు సంబంధించిన సమాచారం ఏమైనా దొరుకుతుందేమోనని భావిస్తున్నట్లు తెలిపారు! ఇటీవల రాజస్థాన్ లో రెక్కీ నిర్వహించిన రితేష్ ను కూడా ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు.

కాగా... కెనడా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ముఠా కార్యకలాపాలను నిర్వహించే అన్మోల్ బిష్ణోయ్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ) తన ప్రయత్నాలను ఉధృతం చేసింది. ఇందులో భాగంగా... అతడిని పట్టుకోవడానికి సహకరించే సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్ ఇస్తామని పేర్కొంది. ఇదే సమయంలో అతడిని మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో చేర్చింది.