Begin typing your search above and press return to search.

ఫోర్జరీ సంతకాల మేటర్... తెరపైకి టీవీ5 సాంబశివరావు వ్యవహారం!

అవును... సాంబశివరావు సంబంధించిన ఒక పెట్రోల్ బంక్ ను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 9:30 AM GMT
ఫోర్జరీ సంతకాల  మేటర్... తెరపైకి టీవీ5 సాంబశివరావు వ్యవహారం!
X

టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావుకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తుంది! ఇందులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులు ల్యాండ్ నకిలీ ధృవపత్రాలతో, భూ యజమానికి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంక్ నిర్వహిస్తున్నారనే ఒక వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో ఈ వ్యవహారంలో రాజకీయ పాత్రపైనా చర్చ మొదలైందని తెలుస్తుంది.

అవును... సాంబశివరావు కుటుంబానికి సంబంధించిన ఒక పెట్రోల్ బంక్ ను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సాంబశివరావు కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. అయితే ఈ స్థాయిలో పనులు చేయాలంటే ఒక టీవీ యాంకర్ కు అది సాధ్యం కాకపోవచ్చని.. దీని వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉండొచ్చని అంటున్నారు.

తాజాగా న్యూస్ ఛానల్స్ లో వస్తున్న కథనాల ప్రకారం... దొంగ లీజ్ అగ్రిమెంట్ తో సాంబశివరావు కుటుంబ సభ్యలు అక్రమంగా పెట్రోల్ బంక్ నడుపుతున్నారని తేలినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సంద్యా గ్రూప్ కు సంబంధించిన స్థలంలో సాంబశివరావు కుటుంబ సభ్యులు అక్రమంగా పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లు ఫిర్యాదులు అందాయని.. దీంతో... హెచ్.పి.సీ.ఎల్. బృంధం రంగంలోకి దిగిందని తెలుస్తుంది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పీ.సీ.ఎల్) బృంధం... ఆ బంకులోని సగం బాగాన్ని సీజ్ చేశారు! ఈ వ్యవహారంలో సాంబశివరావు, కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే కథనాలు మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో భూ యజమాని కేసు వేయడంతో.. హెచ్.పి.సీ.ఎల్. రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం గుట్టు రట్టయ్యిందని అంటున్నారు.

శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చ. మీ. స్థలం విషయంలో ఈ వివాదం నెలకొందని తెలుస్తుంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబశివరావు కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారనేది బాధితుల ఆరోపణగా ఉంది. దీని పైన తాము సాంబశివరావు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా... అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు!

ఈ క్రమంలో ఇలాంటి మాటలు చెప్పి చాలా కాలమే అయినా... చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన భూ యజమాని హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిసిన సమయంలో... అక్కడ తమకు ప్రమేయం లేకుండానే హెచ్.పీ.సీ.ఎల్. కు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఇవన్నీ ఫోర్జరీ అని గుర్తించారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో భూ యజమాని ఫిర్యాదుతో మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో సాంబశివరావు కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదైందని తెలుస్తుంది. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై హెచ్.పి.సి.ఎల్. అధికారులు కోర్టు మెట్లక్కారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత స్థలాన్ని మాత్రమే లీజుకు తీసుకుని, మిగతా స్థలానికి ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారని.. ఆ విధంగా హెచ్.పి.సీ.ఎల్. ను బురిడీ కొట్టించారని తేటతెల్లమైందని తెలుస్తుంది. దీంతో ఆ ల్యాండ్ లో ఆక్రమిత భాగాన్ని అధికారులు సీజ్ చేస్తున్నారు!

దీంతో బంకు కార్యకలాపాలు స్థంభించిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు! మరోపక్క పొద్దున్న లేస్తే శుద్ధులు చెప్పే పెద్ద మనుషులు.. వెనుక ఇలాంటి పనులు చేస్తూ.. పైకి మాత్రం శ్రీరంగ నీతులు చెబుతుంటారా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు! మరోపక్క... నిత్యం చంద్రబాబు జపం, టీడీపీకి అనుకూల స్వరం వినిపించే సాంబశివరావు చేసిన ఈ పని వెనుక బాబు & కో హస్తం కూడా బలంగా ఉండి ఉండొచ్చనే కామెంట్లు టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి!

ఆ సంగతి అలా ఉంటే... ఈ స్థాయిలో పనులు చేయాలంటే ఒక టీవీ యాంకర్ కు అది సాధ్యం కాకపోవచ్చని.. దీని వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉండొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ పెట్రో బంక్ కు అనుమతుల విషయంలో పెద్ద పెద్ద రాజకీయ నేతలు, పలువురు అధికారుల హస్తం ఉందనే చర్చ కూడా తెరపైకి వస్తుంది.