Begin typing your search above and press return to search.

యూట్యూబ్‌ ఫాలోవర్స్‌ కోసం ఇదేం పాడుపని!

అయితే ఆ యూట్యూబ్‌ చానల్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడి పేరు మీద లేదు. అతడి భార్య పేరుతో ఆ యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్నాడు

By:  Tupaki Desk   |   8 April 2024 5:18 AM GMT
యూట్యూబ్‌ ఫాలోవర్స్‌ కోసం ఇదేం పాడుపని!
X

వెర్రి వేయి తలలేస్తుందని సామెత. ఇప్పుడు అచ్చం ఇలాంటిదే జరిగింది. ఒక ఉపాధ్యాయుడు తన య్యూటూబ్‌ చానల్‌ కు ఫాలోవర్స్‌ ను పెంచుకోవడానికి పాడు పని చేశాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆ వ్యక్తి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రశ్నపత్రాలను తన యూట్యూబ్‌ చానల్‌ లో లీక్‌ చేశాడు. ఆ ప్రశ్నపత్రాలను యూట్యూబ్‌ చానల్‌ లో అప్‌ లోడ్‌ చేశాడు.

అయితే ఆ యూట్యూబ్‌ చానల్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడి పేరు మీద లేదు. అతడి భార్య పేరుతో ఆ యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్నాడు. ప్రశ్నపత్రాలను యూట్యూబ్‌ లో అప్‌ లోడ్‌ చేసిన వ్యవహారం వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉపాధ్యాయుడు, అతడి భార్యను, వీరికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

దేశవ్యాప్తంగా ఈ ఘటన వైరల్‌ గా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని గంజాం జిల్లాలోని రంభ అనే ప్రాంతంలో సమీర్‌ సాహు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య పేరుతో ‘సమీర్‌ ఎడ్యుకేషనల్‌’ అని ఒక యూట్యూబ్‌ చానల్‌ ను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో చానల్‌ కు పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ రావడానికి తప్పుడు పని చేశాడు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రశ్నపత్రాలను యూట్యూబ్‌ చానల్‌ లో అప్‌ లోడ్‌ చేశాడు. ఈ ప్రశ్నపత్రాల కోసమైనా తన యూట్యూబ్‌ చానల్‌ కు పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ వస్తారని ఆశించాడు.

ఈ క్రమంలో పరీక్షలకు ముందు ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌ లో వైరల్‌ అవుతుండటంతో ఒడిశా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ అథారిటీ డైరెక్టర్‌ మార్చి18న భువనేశ్వర్‌ సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ పని చేస్తుంది ప్రభుత్వ ఉపాధ్యాయుడు సమీర్‌ సాహు అని తేల్చారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సమీర్‌ సాహు ఇంటిలో సోదాలు చేపట్టారు. అతడి వద్ద ఉన్న ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. సమీర్‌ కు ‘సమీర్‌ ఎడ్యుకేషనల్‌’తోపాటు ‘పోఆన్సర్‌’ అనే మరో యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. అందులో కూడా ప్రశ్నపత్రాలను అప్‌ లోడ్‌ చేసినట్టు అంగీకరించాడు.

ప్రోఆన్సర్‌ యూట్యూబ్‌ చానల్‌ లో జాజుపూర్‌ లోని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగన్నాథ్‌ కర్, అతని భార్య రూతుపూర్ణ పతి ప్రశ్నపత్రాలను అప్‌ లోడ్‌ చేసినట్టు సమీర్‌ సాహు పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రాలను, ల్యాప్‌ టాప్‌ ను సీజ్‌ చేశారు.