Begin typing your search above and press return to search.

అమితాబ్ "పా" వ్యాధితో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి మృతి!

అయితే... ఇదే వ్యాధితో సుధీర్ఘ కాలం జీవించిన "సమ్మీ బస్సో" తన 28వ ఏట కన్నుమూశాడు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 2:17 PM GMT
అమితాబ్ పా వ్యాధితో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి మృతి!
X

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సినిమా "పా" సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో బిగ్ బీ అత్యంత ఆరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతుంటరు. ప్రొజెరియా అనే ఈ వ్యాధి సోకిన చిన్నారులకు బాల్యంలోనే వృద్ధాప్య ఛాయలు ఉంటాయి. దీంతో వారు చిన్న వయసులోనే మరణిస్తుంటారు.

అయితే... ఇదే వ్యాధితో సుధీర్ఘ కాలం జీవించిన "సమ్మీ బస్సో" తన 28వ ఏట కన్నుమూశాడు. ఈ అరుదైన జన్యు వాధి ప్రొజెరియా తో బాధపడుతూ ఎక్కువ కాలం జీవించిన వక్తిగా రికార్డుకెక్కాడు. సాధారణంగా ఈ వ్యాధి సోకిన చిన్నారులు తమ రెండేళ్ల వయసులోనే వృద్ధాప్యానికి చేరుకుంటారు!

అవును... బస్సో, అతని తల్లితండ్రులు స్థాపించిన ఇటాలియన్ ప్రొజెరియా అసోసియేషన్ నుంచి వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. అరుదైన జన్యు వ్యాధి ప్రొజెరియాతో ఎక్కువ కాలం జీవించిన ఉన్న "సమ్మీ బస్సో" 28 సంవత్సరాల వయసులో మరణించాడు. వాస్తవానికి ఈ వ్యాధి బారిన పడినవారి ఆయుర్ధాయం గరిష్టంగా 13.5 ఏళ్లు మాత్రమే ఉంటుంది!

ఇక ఈ వ్యాధి ప్రతీ ఎనిమిది మిలియన్ల మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఇటాలియన్ ప్రొజెరియా అసోసియేషన్ వెబ్ సైట్ లో బస్సో జీవిత చరిత్రను పొందుపరిచారు! ఈ డేటా ప్రకారం 1995 డిసెంబర్ 1వ తేదీన ఇటాలియన్ పట్టణంలోని షియోలో బస్సు జన్మించాడు. అతనికి రెండేళ్ల వయసులో ఈ వ్యాధి సోకింది.

ఈ నేపథ్యంలో... అతని తల్లితండ్రులు ఇటాలియన్ ప్రొజెరియా అసోసియేషన్ ను స్థాపించారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలో సమ్మ్మీ బస్సో జీవితాన్ని చూపించారు. ప్రొజెరియా రీసెర్చ్ ఫౌండేషన్ కు అంతర్జాతీయ రాయబారిగా కూడా బస్సో పనిచేశాడు. ఇటలీలోని పాడువా యూనివర్శిటీ నుంచి పట్టభద్రుడయ్యాడు.

కాగా... పలు నివేదికలు, మీడియా కథనాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రొజెరియా కేసులు 130 మాత్రమే నమోదవ్వగా వాటిలో నాలుగు ఇటలీలో ఉన్నాయి.