Begin typing your search above and press return to search.

గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు... ఛేజింగ్ చేసి మరీ పట్టుకున్న సన!

మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరభ్ గంగూలీ కుమార్తె సనాక్ తృటిలో ప్రమాదం తప్పింది.

By:  Tupaki Desk   |   4 Jan 2025 5:01 AM GMT
గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు... ఛేజింగ్ చేసి మరీ పట్టుకున్న సన!
X

మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరభ్ గంగూలీ కుమార్తె సనాక్ తృటిలో ప్రమాదం తప్పింది. ఓ బస్సు.. ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. శుక్రవారం రాత్రి కోల్ కతా లోని డైమండ్ హార్బర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర కలకలం రేపింది.

అవును... సౌరభ్ గంగూలీ కుమార్తె సనాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఇందులో భాగంగా... ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టింది. కోల్ కతా నుంచి రాయ్ చక్ వెళ్తున్న ఆ బస్సు.. బెహలా చౌరస్తా ప్రాంతంలో సనా కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో.. కారును డ్రైవర్ నడుపుతుండగా, సనా పక్క సీట్లో కూర్చుని ఉన్నారు.

ఈ సమయంలో... వారు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీ కొట్టిన అనంతరం బస్సు వేగంగా వెళ్లిపోయింది. దీంతో.. కారు డ్రైవర్ దాన్ని వెంబడించారు. ఈ ఛేజింగ్ లో భాగంగా కొంత దూరం వెళ్లిన తర్వాత బస్సును అడ్డగించిన గంగూలీ కుమార్తె.. పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ఆ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... ఈ ప్రమాదంలో సనా కారు స్వల్పంగా ధ్వంసమైందని.. అయితే ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.