ఇసుక - మద్యం అయిపోయాయి.. ఇప్పడు 'దీపం' ..!
మహిళా ఓటు బ్యాంకును చీల్చడంలోనూ.. వైసీపీ ఓడించడం లోనూ ఈ పథకం కీలకంగా మారింది.
By: Tupaki Desk | 22 Oct 2024 4:45 PM GMTరాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన దీపం పథకానికి ముహూర్తం రెడీ అయింది. ఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిళలకు ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లను అందించే ఈ పథకంపై మహిళలు చాలానే ఆశలు పెట్టుకున్నారు. మహిళా ఓటు బ్యాంకును చీల్చడంలోనూ.. వైసీపీ ఓడించడం లోనూ ఈ పథకం కీలకంగా మారింది.
ఎన్నికలకు ముందు చెప్పిన ఉచిత ఇసుక, నూతన మద్యం విధానాలను అమలు చేసిన సర్కారు.. ఇప్పుడు దీపంపై దృష్టి పెట్టింది. ప్రతి నాలుగు మాసాలకు ఒకటి చొప్పున ఈ సిలిండ్లను అందిస్తారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం సర్కారుపై ఏటా 3 వేల కోట్ల రూపాయల భారం పడనుంది. ముందుగానే సిలిండర్ బుక్ చేసుకుని.. పూర్తి మొత్తం చెల్లించిన వారికి తర్వాత.. సబ్సిడీ నగదును వెనక్కి ఇవ్వనున్నా రు. దీనికి సంబంధించి అర్హులైన వారికి మాత్రమే రియింబర్స్‌మెంట్ జరుగుతుంది.
అయితే.. ఇది కూడా ఇబ్బందులు పడేలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎందు కంటే.. ఎన్నికలకు ముందు మహిళలకు అందరికీ ఈ పథకం వర్తింప చేస్తామని స్వయంగా చంద్రబాబు చెప్పారు.దీనిపై దాదాపు 80 శాతం మంది మహిళలు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు వేస్తున్న అం చనా ప్రకారం.. అర్హతల బ్రేకుల ప్రకారం.. 35 శాతం మంది మహిళలకు మాత్రమే ఈ పథకం అందనుం ది. దీంతో మహిళల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోందన్నది పరిశీలకుల మాట.
అసలు గ్యాస్ పథకాన్ని అమలు చేసేందుకు ఏప్రాతిపదికలు తీసుకున్నారు? అర్హులను ఎలా ఎంపిక చేస్తారు? అనేది ఇప్పటి వరకు సర్కారు చెప్పలేదు. దీనిని బట్టి.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న `దీపం` పథకం కింద.. రాష్ట్రంలో లబ్ధిదారులుగా ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింప చేసే ఆలోచన లో ఉన్నట్టు సమాచారం. వారి సంఖ్య 25 శాతం మాత్రమే ఉంది. అది కూడా.. ముందుగానే ప్రజలు సొమ్ము చెల్లించాలి. కాబట్టి.. ఇవన్నీ.. మహిళా మణులకు ఒకింత నిరాస కలిగించేవే. కాబట్టి.. ఇసుక, మద్యం మాదిరిగా `దీపం` పథకం కూడా సెగ పెట్టుకుండా సర్కారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.