Begin typing your search above and press return to search.

రోజా రోత మ‌నిషి.. మాట్లాడ్డం వేస్ట్‌: టీడీపీ

వైసీపీ నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్ నేత‌.. మాజీ మంత్రి రోజాపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By:  Tupaki Desk   |   4 April 2025 10:59 AM
రోజా రోత మ‌నిషి.. మాట్లాడ్డం వేస్ట్‌:  టీడీపీ
X

వైసీపీ నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్ నేత‌.. మాజీ మంత్రి రోజాపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``నాకు మావాళ్లు చెప్పారు. రోజా రోత వీడియోలు చేస్తుంద‌ట‌. అలాంటి రోత మ‌నిషి గురించి ఏం మాట్లాడ‌తాం.. మ‌న టైమ్ వేస్ట్`` అని వ్యాఖ్యానించారు. తాజాగా.. మీడియాతో మాట్లాడిన‌.. సంధ్యారాణి.. మాజీ మంత్రి రోజా ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. రోజా రోత మనిషి.. అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఆమె క్రీడ‌ల శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియో గం చేశార‌ని ఆరోపించారు. ఆమెతోపాటు.. శాప్ చైర్మ‌న్ బైరెడ్డి కూడా వాటాలు పంచుకున్న‌ట్టు చెప్పారు. ఆ అవినీతి, అక్ర‌మాల‌పై నిగ్గు తేల్చేందుకు ప్ర‌భుత్వం క‌మిటీ వేసింద‌న్నారు. అయితే.. ఈ విష‌యం తెలిసి న `రోత రోజా`(ఇలానే అన్నారు) నీతులు చెబుతోంద‌ని.. ఆ మాట‌లు వింటేనే రోత‌గా ఉన్నాయ‌ని అన్నా రు. రోత మనుషులు రోత‌గానే మాట్లాడ‌తార‌ని ఎద్దేవా చేశారు.

త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై వైసీపీ నాయ‌కుల‌కు ముఖ్యంగా రోత రోజాకు ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేద‌న్నా.. చంద్ర‌బాబు దూర దృష్టితోనే సూప‌ర్‌ సిక్స్ ప‌థ‌కానికి శ్రీకారం చట్టార‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క మాతృమూర్తికి ఈ ప‌థ‌కాన్ని చేరువ చేసేందుకు తాము బాధ్య‌త తీసుకుంటాన్నారు. అయితే.. వైసీపీ నాయ‌కులు చేస్తున్న విష ప్ర‌చారాన్ని ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని మంత్రి సంధ్యారాణి సూచించారు. అలాగే.. రైతుల‌కు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల‌ను కూడా త్వ‌ర‌లోనే అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నం కృత నిశ్చ‌యంతో ఉంద‌న్నారు.