Begin typing your search above and press return to search.

మూడ‌వ పెళ్లిపై సానియా ఫ్యామిలీ రియాక్ష‌న్!

తాజాగా షోయ‌బ్ మూడ‌వ వివాహంపై సానియా మీర్జా కుటుంబం స్పందించింది. షోయ‌బ్ కి పెళ్లి శుభాకాంక‌క్ష‌లు చెబుతూ ఓ పోస్ట్ చేసింది ఆ ఫ్యామిలీ.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:18 AM GMT
మూడ‌వ పెళ్లిపై సానియా ఫ్యామిలీ రియాక్ష‌న్!
X

షోయ‌బ్ మాలిక్ పాకిస్తాన్ న‌టి న‌టి స‌నా జావెద్ ని మూడ‌వ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. షోయబ్ మాలిక్- సానియా మీర్జా త‌మ ధాంప‌త్య జీవితానికి స్వ‌స్తి చెబుతూ విడాకులు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే షోయ‌బ్ వెంట‌నే మూడ‌వ పెళ్లితో అభిమానులంద‌రికి మ‌రోసారి బిగ్ షాక్ ఇచ్చాడు. ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు వీగిపోయి నేప‌థ్యంలో మూడ‌వ పెళ్లి విష‌యంలో షోయ‌బ్ పై ర‌క‌ర‌కాల కామెంట్లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఇక షోయ‌బ్ కి త‌న ప్ర‌వ‌ర్తన న‌చ్చ‌క సానియా మీర్జా స్వ‌యంగా కావాల‌నే విడాకులు ఇచ్చిన‌ట్లు సానియా తండ్రి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా షోయ‌బ్ మూడ‌వ వివాహంపై సానియా మీర్జా కుటుంబం స్పందించింది. షోయ‌బ్ కి పెళ్లి శుభాకాంక‌క్ష‌లు చెబుతూ ఓ పోస్ట్ చేసింది ఆ ఫ్యామిలీ. సానియా త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచుతుంది. ఈ క్లిష్ట స‌మ‌యంలో ఆమె స్పందిం చాల్సి వ‌స్తోంది.

షోయ‌బ్ తో సానియా కొన్ని నెల‌ల క్రిత‌మే విడాకులు తీసుకున్నారు. ఈ విష‌యంలో ఇక‌పై చ‌ర్చ అన‌వ‌స ర‌మైన‌దిగా భావిస్తున్నాం. ఈ స‌మ‌యంలో సానియా అభిమానుల‌కు ఆమెకి అండ‌గా నిల‌వాల‌ని కోరుకుం టున్నాం. జీవితంలో కొన్ని కొన్ని చేదు ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కుని ముందుకు వెళ్ల‌డ‌మే మంచిదంటూ' సానియా ఫ్యామిలీ అభిప్రాయ‌ప‌డింది. సానియా మీర్జా-షోయ‌బ్ మాలిక్ 2017లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆ పెళ్లి హైద‌రాబాద్ లోనే అంగరంగ వైభ‌వంగా జ‌రిగింది. పెళ్లి నేప‌థ్యంలో ఇద్ద‌రు చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. షోయ‌బ్ మాలిక్ పాక్తిస్తాన్ ప్లేయ‌ర్ కావ‌డంతోనే ఈ విమ‌ర్శ‌లు సానియా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే పెళ్లి అనంత‌రం కొత్త కాపురం దుబాయ్ లో ప్రారంభించారు. ఆ జంట‌కు ఓ బాబు కూడా క‌ల‌డు.