Begin typing your search above and press return to search.

ట్రైనీ డాక్టర్ కేసు... నిందితుడి సైకో అనాలసిస్ టెస్ట్ లో షాకింగ్ విషయాలు!

కోల్ కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Aug 2024 9:26 AM GMT
ట్రైనీ డాక్టర్ కేసు... నిందితుడి సైకో అనాలసిస్ టెస్ట్ లో షాకింగ్ విషయాలు!
X

కోల్ కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తం అయ్యింది. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మరోపక్క ఈ కేసును సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కీలక విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును... దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతాలోని జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సీబీఐ అధికారులు . ఈ సమయంలో అతనికి సైకో అనాలసిస్ టెస్ట్ చేయించారు. దీని ద్వారా అతడి మానసిక పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుకుంటారు! ఈ పరీక్ష నిర్వహించే ముందు నిందితుడి వాంగ్మూలం తీసుకున్నారు!

అనంతరం అతడికి సైకో అనాలసిస్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ లో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. విస్తుగొలిపే విషయాలు తెరపైకి వచ్చాయని అంటున్నారు. ఇందులో భాగంగా... అతడు వికృతమైన సెక్స్ అలవాట్లకు బానిస అయ్యాడని.. ఆ సమయంలో అతడు జంతువులా ప్రవర్తించేవాడని అధికారులు గుర్తించారు.

ఇదే సమయంలో... విచరణలో అతడు ఏ మాత్రం భావోద్వేగానికి గురికాలేదని అంటున్నారు. ప్రతీ ప్రశ్నకూ ఎలాంటి తొందరపాటూ లేకుండా జవాబు చెప్పాడని సీబీఐ అధికారులు తెలిపారు. మొత్తంగా అతడి ఆలోచనా విధానం పశువు కంటే దారుణంగా ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

కాగా... ఆర్జీ కర్ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలు అభయ (31)పై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై తెల్లవారుజామున 2 - 3 గంటల మద్య ఆమెపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు.. అతి దారుణంగా ఆమె ప్రాణాలు తీశాడు.

మర్నాడు ఆగస్టు 9న సెమినార్ హాల్ లో నగ్నంగా ఉన్న ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇద్దరు ఏసీపీలు, ఒక ఇనిస్పెక్టర్ పై వేటు!:

పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనలో గతవారం ఆర్జీ కర్ ఆస్పత్రిపై జరిగిన విధ్వంసానికి సంబంధించి ముగ్గురు అధికరులు సస్పెండ్ అయ్యారు. ఆస్పత్రిపై విధ్వంసం జరిగిన సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లను, ఒక ఇనిస్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వీరిపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు!