Begin typing your search above and press return to search.

ఇవి కార్పోరేట్ ఎగ్జిట్ పోల్స్ !

మరో 48 గంటల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికార, విపక్షాలు ఎగ్జిట్ పోల్స్ మీద వాదోపవాదాలు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   2 Jun 2024 12:30 PM GMT
ఇవి కార్పోరేట్ ఎగ్జిట్ పోల్స్ !
X

సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో దేశంలో ఎవరు గెలుస్తారు అన్న అంచనాలతో ఎగ్జిట్ పోల్స్ తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం దేశమంతా ఎగ్జిట్ పోల్స్ మీద చర్చలు నడుస్తున్నాయి. మరో 48 గంటల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికార, విపక్షాలు ఎగ్జిట్ పోల్స్ మీద వాదోపవాదాలు చేసుకుంటున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉండడంతోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ ఒకే రకంగా ఉన్నాయని అన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ‘కార్పొరేట్ల క్రీడ’గా అభివర్ణించారు. 295 నుంచి 310 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు.

బారామతిలో ఎన్సీపీ నేత సుప్రియా సూలే 1.5 లక్షల మెజార్టీతో గెలుస్తుందని, శివసేన గతంలో సాధించిన 18 సీట్లను నిలబెట్టుకుంటుందని సంజయ్ రౌత్ అన్నాడు. యూపీలో ఇండియా కూటమి 35, బీహార్‌లో ఆర్జేడీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నాడు.