Begin typing your search above and press return to search.

ఈ సారి సంక్రాంతి కి విదేశాల నుంచి 'కోళ్ల'ను దించుతున్నారు!

ఏపీలో కోళ్ల పందాలకు చాలా మంది ఆకర్షితులవుతుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తుంటారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 6:40 AM GMT
ఈ సారి సంక్రాంతి కి విదేశాల నుంచి  కోళ్లను దించుతున్నారు!
X

పూర్వం రోజుల్లో మనుషులకు ఎలాంటి వినోద కార్యక్రమాలు లేకపోవడంతో ఆటలతో సేద తీరేవారు. వినోదం అందులోనే వెతుక్కునేవారు. కాలక్రమేణా సాంకేతికత పెరిగి టీవీలు, ఫోన్లు రావడంతో మనుషుల్లో అంతరాలు పెరిగిపోయాయి. ఫలితంగా వినోదం ఇప్పుడు తెర మీదే చూసుకుంటున్నాం. కానీ ఆశించిన మేర వినోదం మాత్రం అందడం లేదు. దీంతో వినోదాన్ని వెతుక్కునే పనిలోనే ఉంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలకు భలే డిమాండ్ ఉంటుంది. కోడి పందాలు ఆడటం వల్ల రూ. కోట్లు చేతులు మారుతుంటాయి. కోడి పందాలు కరెక్టు కాదని కోర్టులు మొత్తుకున్నా సుప్రీంకోర్టు వరకు వెళ్లి మరీ కోడి పందేల ఆటలను చట్టబద్ధత కోసం ప్రయత్నిచడం సంచలనం కలిగించింది. దీంతో ఈ సారి కోడి పందాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏపీలో కోళ్ల పందాలకు చాలా మంది ఆకర్షితులవుతుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జరుపుకున్నా కోడి పందాలు మాత్రం ఏపీలోనే నిర్వహిస్తుంటారు. దీని కోసం కోట్లాది రూపాయలు చేతులు మారడం విశేషం. ఈనేపథ్యంలో కోడి పందాలంటే వారికి మహా సరదా.

కోడి పందాల కోసం కోళ్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గతంలో మంగోలియా దేశం నుంచి దిగుమతి చేసుకునే వారు. ప్రస్తుతం మాత్రం లాటిన్ అమెరికా, పెరూ దేశాల నుంచి కోళ్లు దిగుమతి చేసుకుంటున్నారు. విమానాల్లో వాటిని తీసుకొచ్చి పందాల్లో నిలపాలని చూస్తున్నారు. అవి పందాల్లో తమ శక్తితో పోటీలో నెగ్గుతున్నాయి. దీంతో పందెం కోసం రూ. లక్షలు పెడుతుండటం గమనార్హం.

కోడి పందాల కోసం కొందరు వాటిని పెంచుతున్నారు. అది కుటీర పరిశ్రమగా మారింది. ఉద్యోగాలు చేసే వారు కూడా వాటిని వదిలేసి కోళ్లపెంపకంపై ఫోకస్ పెడుతున్నారు. ఫలితాలు కూడా పొందుతున్నారు. నాటుకోళ్ల పెంపకంతో మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఇలా కోడి పందాల నేపథ్యం పలువురికి డబ్బు సంపాదించి పెడుతోంది. కోళ్ల పందాల కోసం చాలా మంది ఆసక్తి చూపించడం తెలిసిందే.