Begin typing your search above and press return to search.

ప్రతి ఆరు నెలలకూ ఎన్నికలు జరిగేది ఇక్కడే... ట్విస్ట్ ఏంటంటే...?

ఆ దేశం పేరే... శాన్ మారినో! ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటిగా చెప్పుకునే శాన్ మారినో... ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంగా కూడా ప్రసిద్ధికెక్కింది.

By:  Tupaki Desk   |   17 Oct 2023 4:30 PM GMT
ప్రతి ఆరు నెలలకూ ఎన్నికలు జరిగేది ఇక్కడే... ట్విస్ట్  ఏంటంటే...?
X

సాధారణంగా భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకూ ఒకసారి జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ మామూలుగా ఏడాదిపొడవునా సార్వత్రిక ఎన్నికల దగ్గరనుంచి స్థానిక సంస్థల ఎన్నికలవరకూ ఏదో మూల ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. అయితే అలా కాకుండా... దేశం మొత్తానికి ఒకేసారి ప్రతీ ఆరునెలలకూ ఎన్నికలు జరిగే దేశం ఒకటి ఉంది. దాని కథాకమీషు ఏమిటో ఇప్పుడు చూద్దాం...!

అవును... యూరప్ ఖండంలోని ఒక దేశంలో ప్రతీ ఆరునెలలకూ ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఆ దేశం పేరే... శాన్ మారినో! ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటిగా చెప్పుకునే శాన్ మారినో... ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఈ దేశంలో రొటీన్ కి భిన్నంగా ఏడాదిలో రెండుసార్లు, అంటే ప్రతీ ఆరు నెలలకూ ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.

ఇలా ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాలతో ఎన్నికైన దేశాధినేతను ఆ దేశ ప్రజలు కెప్టెన్-రీజెంట్ అని పిలుస్తారు. ఇక అక్కడ గ్రేట్, జనరల్ అనే రెండు కౌన్సిల్‌ లోని 60 మంది సభ్యులు కెప్టెన్ రీజెంట్‌ ను ఎన్నుకుంటారు. ఇక ఇక్కడి పార్లమెంటును ఆరంగో అంటారు. ఈ దేశం పూర్తిగా ఇటలీతో చుట్టబడి ఉంటుంది.

ఇక 23 చదరపు మైళ్లు (61 చదరపు కిలోమీటర్లు) వైశాల్యంకలిగిన ఈ చిన్నదేశం జనభా కేవలం 40,000 మాత్రమే! ఈదేశ రాజధాని శాన్ మారినో నగరం కాగా... ఇక ఈ దేశంలోని అతిపెద్ద నగరం డోగానా. ఈ దేశ అధికారిక భాష ఇటాలియన్ కాగా... ఇక్కడ కరెన్సీ యూరో!

ఇక ఈ దేశ చరిత్ర విషయానికొస్తే... నాలుగో డశాబ్ధంలో మారినస్ ది డాల్మేషియన్ అనే వ్యక్తి అర్బే ద్వీపం నుండి పారిపోయి మోంటే టైటానోలో దాక్కున్నాడట. క్రిస్టియన్ వ్యతిరేక రోమన్ చక్రవర్తి డయోక్లెటియన్ నుండి తప్పించుకోవడానికి మారినస్ అర్బే నుండి పారిపోయాడట.

ఇలా ఆర్బే నుంచి మోంటే టైటానోకు వచ్చిన కొద్దికాలానికే అతను ఒక చిన్న క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడని.. ఆ తర్వాత మారినస్ గౌరవార్థం శాన్ మారినో అనే గణతంత్ర రాజ్యంగా మారిందని చెబుతారు. ఇలా ఏర్పడిన ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు క్రీస్తు శకం 1243లో జరిగగా.. ఈ దేశ రాజ్యాంగం 1600 నుంచి అమల్లోకి వచ్చింది.