టవల్ తో పబ్లిక్ లో మోడల్ డ్యాన్స్.. పిచ్చి పీక్స్ వీడియో!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కోసం కొంతమంది యువత చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 20 Nov 2024 12:45 PM GMTఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కోసం కొంతమంది యువత చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తారతమ్యాలేవీ లేవు. ఎవరి స్థాయిలో వారు రెచ్చిపోతున్నారు! ఈ సమయంలో తాజాగా ఓ మోడల్.. పబ్లిక్ ప్లేస్ లో ఓ టవల్ మాత్రమే ధరించి డ్యాన్స్ చేసింది!
అవును... సోషల్ మీడియా మాయలో కొంతమందికి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోతుందనే కామెంట్లు ఇటీవల బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి బలం చేకూరుస్తూ అన్నట్లుగా... తాజాగా కోల్ కతా మోడల్ ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు పబ్లిక్ అంతా చూస్తుండగా.. తెల్లటి టవల్ మాత్రమే చుట్టుకుని డ్యాన్స్ చేసింది!
ఈ సమయంలో... బాలీవుడ్ సినిమా దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే పాటకు పెదవి సింక్ చేస్తూ తెల్లటి టవల్ ధరించి, చెప్పులు వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ ప్రాంతంలో పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో పర్యాటకుల గుంపు ఉంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోతో పాటు.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా మీరంతా ధైర్యం, దయ, సానుభూతితో ప్రేరేపించడం కొనసాగించండి అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ వీడియోకి సంబంధించిన కామెట్స్ లో విభిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
ఇందులో భాగంగా... "స్వతంత్ర దేశంలో మీరు ఏమైనా చేయొచ్చు కానీ... మెమోరియల్ ముందు కాదు" అని ఒకరు కామెంట్ చేస్తే... "ఆమెను అరెస్ట్ చేసి కనీసం మూడేళ్లు జైలులో ఉంచండి!" అని మరొకరు స్పందించారు.